Natyam ad

సత్యం రాజేష్ ‘టెనెంట్’ టైటిల్ గ్లింప్స్ విడుదల

హైద్రాబాద్ ముచ్చట్లు:

కమెడియన్‌గా, నటుడిగా అందివచ్చిన అవకాశాలతో.. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపును, ఇమేజ్‌ను సొంతం చేసుకున్న నటుడు సత్యం రాజేష్. ఇప్పుడాయన హీరోగా నటించిన ‘మా ఊరి పొలిమేర -2’ చిత్రం ఈ నవంబర్ 3న గ్రాండ్‌గా విడుదల కాబోతుండగా.. తాజాగా ఆయన నటించిన మరో చిత్రం ‘టెనెంట్’ టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ లాంచ్ చేశారు. మహాతేజ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోన్న ఈ ‘టెనెంట్’ చిత్రం మన చుట్టూ జరిగే సంఘటనలకి దగ్గరగా ఉండే ఒక సింపుల్ ఫ్యామిలీ ఎమోషనల్ మర్డర్ మిస్టరీ కథ. ముఖ్యంగా ఆడవాళ్లు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. ‘అద్భుతం’ చిత్రాన్ని నిర్మించిన మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించగా.. ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ చిత్రానికి దర్శకత్వం వహించిన వై. యుగంధర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ.. స్ర్కీన్‌ప్లే, సంభాషణల్ని కూడా అందించారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలను మేకర్స్ తెలియజేయనున్నారు.
సత్యం రాజేష్, మేఘా చౌదరి, చందన పయ్యావుల, భరత్ కాంత్, తేజ్ దిలీప్, ఆడుకాలం నరేన్, ఎస్తేర్ నొరోన్హ, ధనా బాల, చందు, అనురాగ్, రమ్య పొందూరి, మేగ్న తదితరులు నటించిన ‘టెనెంట్’ చిత్రానికి
మ్యూజిక్ కంపోజర్ మరియు లిరిసిస్ట్: సాహిత్య సాగర్.

 

Post Midle

Tags: Satyam Rajesh ‘Tenant’ Title Glimpses Released

Post Midle