పలువురిని పరామర్శించిన సత్యనారాయణ

జగిత్యాల ముచ్చట్లు :

 

సారంగపూర్ మండలంలోని పెంబట్ల ,కొనపూర్ , పోచంపేట గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన పలువురు కుటుంబ సభ్యులను  జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు పైడిపల్లి సత్యనారాయణ రావు, సారంగపూర్ మండల బీజేపీ అధ్యక్షుడు ఎండబెట్ల వరుణ్ కుమార్ పరామర్శించారు. పెంబట్ల గ్రామానికి చెందిన పత్తి తిరుమల అనే వివాహిత కొద్దీ రోజుల క్రితం మృతి చెందగా, వారి కుటుంబాన్ని పరామర్శించి వారి పిల్లలకు రూ.5 వేల  ఆర్ధిక సహాయాన్ని ఎండబెట్ల వరుణ్ కుమార్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పెద్దన్న, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగరాజం, రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యుడు కొక్కు గంగాధర్, జిల్లా ఓబీసీ నాయకులు బాధినేని శేఖర్, మండల ప్రధాన కార్యదర్శి కసనవాదా శాంతయ్య, మండల ఉపాధ్యక్షుడు ముద్దం శ్రీనివాస్, మండల కోశాధికారి ప్రమోద్, మండల కిసాన్ మోర్చ్ అధ్యక్షుడు తోట సంతోష్, బూత్ అధ్యక్షులు తెలు నరేష్, వంగపెళ్లి పవన్ లు పాల్గొన్నారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags: Satyanarayana who consulted many

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *