కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

Satyapal Singh  darwin theory HRD Ministry Scientists

Satyapal Singh  darwin theory HRD Ministry Scientists

సాక్షి

Date :20/01/2018

సాక్షి, ఔరంగాబాద్‌ : ఛార్లెస్‌ డార్విన్‌ ప్రతిపాదించిన జీవపరిణామక్రమ సిద్ధాంతాన్ని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి సత్యపాల్‌ సింగ్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. మానవజాతి భూమి మీద అలాగే ఉండేదని అన్నారు. ఈ నేపథ్యంలో డార్విన్‌ సిద్ధాంతం పూర్తిగా తప్పని చెప్పారు. ఈ సిద్ధాంతాన్ని కళాశాలలు, పాఠశాలల్లో అధ్యాపకులు బోధించడం ఆపాలని పిలుపునిచ్చారు.

డార్విన్‌ సిద్ధాంతం ప్రతిపాదించిన విధంగా మానవ పరిణామ క్రమం గురించి పురాతన భారతీయ గ్రంథాల్లో ఎక్కడా ప్రస్తావించలేదని ఆయన చెప్పారు. డార్విన్‌ పేర్కొన్న జీవపరిణామక్రమ సిద్ధాంతం శాస్త్రీయంగా కూడా నిరూపితం కాలేదని అన్నారు. భూమి ఏర్పడ్డనాటి నుంచి మనిషి.. మనిషిగానే సంచరించాడని, అలాగే ఎదిగాడని తెలిపారు. డార్విన్‌ సిద్ధాంతం తప్పని 35 ఏళ్ల కిందటే శాస్త్రవేత్తలు నిరూపించారని గుర్తు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *