దీక్షిత్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సత్యవతి

Date:23/10/2020

మహబూబాద్  ముచ్చట్లు:

కిడ్నాప్ అయి హత్యకు గురైన దీక్షిత్ రెడ్డి కుటుంబాన్ని మంత్రి సత్యవతి రాథోడ్ పరామర్శించారు. మంత్రి మాట్లాడుతూ అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు కిడ్నాప్ అయ్యి, హత్యకు గురి కావడం అత్యంత బాధాకరం. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారు సమాజానికి చేటు. ఇటువంటి వారిని క్షమించ కూడదని అన్నారు. సమాజంలో వీరికి చోటు లేదు. రంజిత్ కుటుంబాన్ని ఆదుకుంటాం.. అండగా ఉంటాం. వ్యక్తిగతంగా, ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం. పోలీసులు అనేక ప్రయత్నాలు చేసినా లాభం లేకుండా పోయింది. నీచాతి నీచం ఈ చర్య అని అన్నారు.ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై నిఘా ఏర్పాటు చేస్తాం. ఈ నేరంలో సహకరించిన వారిని కూడా వదిలే ప్రసక్తి లేదు. ఎవ్వరికీ అనుమానాలు వద్దు…ఎంత పెద్ద వారైనా, ఎంత మంది ఉన్నా వారిని శిక్షిస్తామని ఆమె అన్నారు.

అనంతపురం కలెక్టరేట్ లో కలెక్టర్ గంధం చంద్రుడు ప్రెస్ కాన్ఫరెన్స్

Tags: Satyavati, the minister who visited Dixit’s family

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *