పాకిస్తాన్ కు సౌదీ షాక్. 

Date:13/08/2020

దుబాయ్ ముచ్చట్లు:

పాకిస్థాన్- సౌదీ అరేబియా మధ్య దశాబ్ద కాలం పాటు సాగిన మైత్రికి తెరపడింది. పాక్‌‌కు ఆర్ధిక సాయం, చమురు సరఫరాను సౌదీ అరేబియా నిలిపివేసినట్టు మిడిల్ ఈ సట్ మోనిటర్ కథనం తెలిపింది. నవంబరు 2018లో పాకిస్థాన్‌కు మొత్తం 6.2 బిలియన్ డాలర్ల ఆర్ధిక సాయాన్ని సౌదీ ప్రకటించింది. ఇందులో 3 బిలియన్ డాలర్లు రుణం, 3.2 బిలియన్ డాలర్ల విలువైన చమురు సరఫరా చేయడానికి గతేడాది ఫిబ్రవరిలో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. సౌదీ రాజు మొహమూద్ బిన్ సల్మాన్ పాక్ పర్యటన సందర్భంగా దీనిపై సంతకాలు చేశారు. సౌదీ ఆర్దిక సాయం నిలిపివేయడంతో పాకిస్థాన్ తక్షణమే ఆ దేశానికి ఒక్క బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.కశ్మీర్ విషయంలో సౌదీ నాయకత్వంలోని ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్ (ఓఐసీ) భారత్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని పాక్ విదేశాంగ శాఖ మంత్రి షా మొహమూద్ ఖురేషీ ఇటీవల బెదిరింపులకు పాల్పడటంతో సౌదీ అరేబియా ఈ నిర్ణయం తీసుకుంది. ఓ న్యూస్ ఛానల్‌తో ఖురేషీ మాట్లాడుతూ.. మీరు ఓఐసీని సమావేశపరచలేకపోతే, కశ్మీర్ సమస్యపై మా వెనుక నిలబడటానికి, అణగారిన కశ్మీరీలకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ఇస్లామిక్ దేశాలతో సమావేశం ఏర్పాటుచేయాలని మా ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను కోరాల్సి వస్తుంది అని అన్నారు.

 

 

 

ఓఐసీ విదేశాంగ మంత్రుల సమావేశాన్ని ఏర్పాటుచేయాలని మరోసారి గౌరవంగా చెబుతున్నానని బెదిరింపు ధోరణి ప్రదర్శించారు.‘కౌలలంపూర్ వేదికగా జరిగిన ఓఐసీ సమావేశంలో సౌదీ వినతితో వెనక్కు తగ్గాం.. ప్రస్తుతం ఈ అంశంపై సౌదీ అరేబియా తన నాయకత్వాన్ని నిలబెట్టుకుంటుందని భావిస్తున్నాం’ అని పాక్ విదేశాంగ మంత్రి అన్నారు.కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను భారత్ రద్దుచేసినప్పటి నుంచి ఈ అంశాన్ని ఓఐసీ సమావేశంలో ప్రస్తావించడానికి పాక్ చేయని ప్రయత్నం లేదు. ఈ ఏడాది మే 22న జరిగిన సమావేశంలో మద్దతు కూడగట్టడానికి పాక్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.దీనిపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ… మా వాణిని వినిపించేందుకు మద్దతు కరువయ్యింది.. ఈ విషయంలో మన మధ్య పూర్తి విభజన ఉంది.. కశ్మీర్‌పై జరిగిన ఓఐసీ సమావేశంలో మాతో ఎవరూ కలిసి రాలేదని వ్యాఖ్యానించారు. మాల్దీవులు సైతం పాక్‌కు మద్దతు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. కశ్మీర్ విషయంలో భారత్‌పై ప్రవేశపెట్టి ఎటువంటి తీర్మానానికి తాము మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేసింది.

అక్రమ  వెంచర్లపై లెక్కలు

Tags:Saudi shock to Pakistan.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *