ఐదు రోజుల పాటు సేవ్ శబరిమల యాత్ర

Savarimala yatra saved for five days

Savarimala yatra saved for five days

Date:10/10/2018
తిరువనంతపురం  ముచ్చట్లు:
శబరిమల తీర్పుపై దేశవ్యాప్తంగా నిరసనలు భగ్గుమంటున్నాయి. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల్ని అనుమతిస్తూ.. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఆందోళనలు ఊపందుకుంటున్నాయి. మహిళా సంఘాలతో పాటూ పలు స్వచ్ఛంద సంస్థలు ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. ఈ నిరసనలకు బీజేపీ కూడా మద్దతు తెలిపింది. ‘సేవ్ శబరిమల’ అంటూ భారీ ఆందోళనా కార్యక్రమానికి పిలుపునిచ్చింది. బుధవారం  నుంచి ‘శబరిమల సంరక్షణ యాత్ర’ను చేపట్టింది. బుధవారం పండలం నుంచి ఈ యాత్ర మొదలు కాబోతోంది. ఐదు రోజుల పాటూ యాత్ర కొనసాగి వచ్చే మంగళవారం నాటికి (15-10-2018) తిరువనంతపురం చేరుకుంటుంది. ఈ యాత్రలో బీజేపీ కార్యకర్తలతో పాటూ భక్తులు భారీగా పాల్గొనబోతున్నారు.
ఈ యాత్రతో పాటూ ఈ నెల 17న బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ‘ఉపవాస ప్రార్థనా యజ్ఞ‌ం’ నిర్వహిస్తున్నారు. శబరిమల పూనకవనంలో భారీ సంఖ్యలో మహిళలు ఉపవాసాలు ఉంటూ.. ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేయనున్నారు. శబరిమల పవిత్రతను కాపాడటమే ధ్యేయమంటున్నారు కేరళ బీజేపీ అధ్యక్షుడు శ్రీధరన్ పిళ్లై. రాష్ట్ర సర్కార్ శబరిమలపై కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. హిందువుల విచ్ఛినం చేయడానికి ప్రయత్నం జరుగుతోందని.. ప్రభుత్వం ఈ వివాదాన్ని శాంతియుత వాతావరణంలో చర్చలతో పరిష్కరించాలన్నారు.
బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా.. భక్తుల మనోభావాలను గౌరవించాలన్నారు. సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సంస్థలకు బీజేపీ మద్దతు ఉంటుందన్నారు. ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డును సీపీఎం బెదిరిస్తోందని ఆరోపించారు శ్రీధరన్. దేవస్థానం తరపున రివ్యూ పిటిషన్ వేయకుండా అడ్డుపడుతున్నారని..సీపీఎం మత విశ్వాసాలను దెబ్బ తిస్తోందన్నారు. ఇటు కాంగ్రెస్ కూడా ఈ వివాదాన్ని రాజకీయంగా వాడుకుంటోందని మండిపడ్డారు శ్రీధరన్. రెండు నాల్కల ధోరణిని ఆ పార్టీ అవలంభిస్తోందని.. వారికి నిజాయితీ ఉంటే తమతో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Tags:Savarimala yatra saved for five days

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *