అంబేద్కర్‌ ఆశయాలను కాపాడుదాం

Save Ambedkar's motives

– రెడ్డెప్ప పిలుపు

Date:14/04/2019

పుంగనూరు ముచ్చట్లు:

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ ఆశయాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని చిత్తూరు వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ అభ్యర్థి ఎన్‌.రెడ్డెప్ప పిలుపునిచ్చారు. ఆదివారం బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ 128 వ జయంతి వేడుకలను పుంగనూరులో ఘనంగా నిర్వహించారు. సీఐ నాగశేఖర్‌, జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌, ఎంఅర్పీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి మిద్దింటి వెంకటస్వామి కలసి అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా రెడ్డెప్ప మాట్లాడుతూ బడుగుబలహీన వర్గాల అభివృద్ధి కోసం రాజ్యాధికారం అందించాలన్న తలంపుతో కృషి చేసిన అంబేద్కర్‌ ఆశయాలను అమలుపరచడంలో ప్రభుత్వాలు విఫలమైందని రెడ్డెప్ప ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్‌ కన్న కళలను సాకారం చేసేందుకు వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే కృషి చేస్తామని తెలిపారు. అలాగే రాష్ట్ర దళిత సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎం.శంకరప్ప ఆధ్వర్యంలో అంబేద్కర్‌కు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మనోహర్‌, రెడ్డిశేఖర్‌, నేతలు అద్దాలనాగరాజ, నరసింహులు, శంకర, పార్థసారధి, అశోక్‌, గంగరాజు, వెంకట్రమణారెడ్డి, విజయకుమార్‌, విశ్వనాథ్‌, బాలాజి, శ్రీనివాసులు, చిన్నప్ప, ఎం.బాబు, ఎం.రామక్రిష్ణ, బి.మోహన్‌, గంగప్ప, జయరామ్‌, గంగరాజు, నాగరాజ, గంగాధరం, లింగప్ప, ప్రేమకుమార్‌, ఖాదర్‌వ ల్లి, అనిల్‌, రవి, మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

 

గడ్డివామి దగ్ధం రూ.75 వేలు నష్టం

Tags: Save Ambedkar’s motives

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *