చెట్లను  కాపాడుకోవాలి 

Save trees

Save trees

 Date:14/07/2018
ఏలూరు ముచ్చట్లు:
పశ్చిమగోదావరిజిల్లాలో ఈఏడాది ట్రీ గార్దులతో కూడిన 25 లక్షల ఎవెన్యూ నాటి జిల్లాను పచ్చదనం ఆహ్లాదకరవాతావరణంలో తీర్చిదిద్దనున్నట్లు జిల్లా కలెక్టర్ డా.కాటంనేని భాస్కర్ చెప్పారు. 69వ వనమహోత్సవం సందర్భంగా శనివారం స్థానిక తంగెళ్లమూడి జెఎంజె స్కూల్ ఆవరణలో శాసన సభ్యులు బడేటి బుజ్జి, మేయర్ షేక్ నూర్జహాన్ లతో కలిసి కలెక్టర్ డా.భాస్కర్ మొక్కలు నాటారు . అనంతరం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మనకు నీరు లేకపోయినా, ఆహారం లేకపోయినా కొద్దిరోజులైనా బ్రతుకగలమని , కాని ఆక్సిజన్ లేకపోతే మనుషులతోపాటు ఏ జీవరాశి ఒక్క క్షణంకూడా బ్రతుకలేమని అన్నారు. సకలజీవరాశి మనుగడకు అవసరమైన ఆక్సిజన్ అందించే చెట్లను మనం కాపాడుకోవాలని అన్నారు. ఈ సంవత్సరం జిల్లాలో 25 లక్షల ఎనెన్యూ ప్లాంటేషన్ తోపాటు, రైతులకు, గృహాలకు అందించేందుకు మరో 40 లక్షల పండ్లమొక్కలను సిద్దం చేశామని చెప్పారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటడంతోపాటు వాటికి నీరుపోసి 100శాతం బ్రతికేలా సంరక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాల విద్యార్థులకు మొక్కలు, వాటి ఉపయోగాలపై అవగాహన కల్పించి ప్రతి విద్యార్థి మొక్కలు నాటేలా చూడాలన్నారు. ఖాళీస్థలాలు, గృహఆవరణలోని ఖాళి ప్రదేశాలలో ఖచ్చితంగా మొక్కలు నాటాలని కలెక్టర్ డా.భాస్కర్ చెప్పారు. ఇతర జిల్లాలు పశ్చిమగోదావరిజిల్లాను ఆదర్శంగా తీసుకునేలా మొక్కలు నాటి పశ్చిమగోదావరి జిల్లాను పచ్చని గోదావరిజిల్లాగా తీర్చిదిద్దడంలో ప్రతిఒక్కరూ సహకరించాలని కలెక్టర్ డా.భాస్కర్ కో%ారు. శాసనసభ్యులు బుజ్జి మాట్లాడుతూ పసిపిల్లలను మనం ఎంత జాగ్రత్తగా ప్రేమగాచూసుకుంటూ పెద్ద చేస్తామో, మొక్కలను కూడా అంతే జాగ్రత్తగా పెంచితే మనకు ఎంతో మేలు చేస్తాయని చెప్పారు. జీవితంలో అందరికీ ఆరోగ్యం ముఖ్యమని, ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఇంటి పరిసరాలలో మొక్కలు నాటాలని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముందుగా పాఠశాలల విద్యార్థులు, అధికారులతో మొక్కల ఆవస్యతపై అవగాహన ర్యాలీ ని నిర్వహించారు.
చెట్లను  కాపాడుకోవాలి https://www.telugumuchatlu.com/save-trees/
Tags:Save trees

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *