మోహినీ అవతారంలో సర్వలోక రక్షకుడు

తిరుపతి ముచ్చట్లు :

 

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన బుధ‌వారం ఉదయం శ్రీనివాసుడు మోహినీ అవతారంలో పల్లకీలో అభయమిచ్చారు. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న సేవ‌లు నిర్వ‌హించారు.సురాసురులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథించిన‌ప్పుడు అమృతం లభించింది. దానిని పంచుకోవడంలో కలహం తప్పలేదు. ఆ కలహాన్ని నివారించి అమృతాన్ని పంచడానికి శ్రీహరి మోహినీ రూపంలో సాక్షాత్కరించారు. సమ్మోహనమైన ఆమె చూపులకు అసురులు పరవశులైపోయి ఉండగా , దేవతలకు అమృతం అనుగ్రహించ‌డం జరిగింది.కాగా సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు విశేషమైన గరుడవాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.ఈ కార్యక్రమంలో ఏఈవో  ప్రభాకర్ రెడ్డి, సూపరింటెండెంట్‌ గోపాలకృష్ణా రెడ్డి, కంకణభట్టార్‌ సూర్యకుమార్‌ ఆచార్యులు, ఇతర ఆధికారులు పాల్గొన్నారు.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags: Savior of the universe in the incarnation of Mohini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *