Natyam ad

నేడు దేశం లో మహిళల ఎదుగుదల సావిత్రిబాయి పూలే బిక్షే-  రిటైర్డ్ కలక్టర్ చోల్లేటి ప్రబాకర్

-ఘనంగా సావిత్రి బాయి పూలే వర్దంతి వేడుకలు.
నల్లగొండ  ముచ్చట్లు:
సావిత్రి బాయి పూలే వర్దంతి వేడుకలు నల్లగొండ లోని ఎల్పిటి మార్కెట్ లోని బిసి సంక్షేమ సంఘం ఆవరణలో ఘనగా నిర్వహించారు. సుంకరి ఫౌండేషన్ సౌజన్యం తో బిసి సంక్షేమ సంఘం జిల్లా అద్యక్షులు దుడుకు లక్ష్మినారాయణ, ప్రదాన కార్యదర్శి నల్లమేకల  విజయ ఆద్వర్యం జరిగిన ఈ వేడుకలకు రిటైర్డ్ కలేక్టర్ చోల్లేటి ప్రబాకర్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. నేడుదేశంలోమహిళలువిద్యాపరంగా,సామాజికంగా,ఆర్ధికంగా,రాజకీయంగా, ఎదిగారంటే అది సావిత్రిబాయి పూలే బిక్షేనన్నారు. మహిళలు అన్ని రంగాలలో ముందుకు రావడానికి ఆనాడు సావిత్రిబాయి పూలే వేసిన  “స్వేచ్ఛ”, సమానత్వం “విద్య” లాంటి చర్యలు సమాజం లో గుణాత్మకమైన  మార్పులు తేనున్నాయన్నారు.అనంతరం బిసి సంక్షేమ సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి నల్లమేకల  విజయ మాట్లాడుతూ  దేశం లో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలైన సావిత్రి బాయి పూలేజయంతి ని మహిళా ఉపాద్యాయ దినోత్సవంగా నిర్వహించాలి. సావిత్రి బాయి.ప్రక్క రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ లో జనవరి 3 వ తేదిని సావిత్రి బాయి పూలే జన్మ దినాన్ని మహిళా ఉపాద్యాయ దినోత్సవంగా జరుపాలని నిర్నయించడం హర్షనీయమని పేర్కొన్నారు.ఏపి ప్రభుత్వ నిర్నయాన్ని బి మహిళా సంఘం  స్వాగతిస్తుందని తెలిపారు.ఆంధ్ర ప్రదేశ్ మాదిరిగానే తెలంగాణా ప్రభుత్వం కుడా సావిత్రిబాయి పూలే  జన్మదినాన్ని మహిళా ఉపాద్యాయ దినోస్సవంగా నిర్వహించాలి. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లు పెట్టి ఆమోదించాలని లత కోరారు.అలాగే పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే మహిళ బిల్లులో బి.సి. మహిళలకు జనాభా ప్రకారం సబ్-కోటా ఇవ్వాలని లతడిమాండ్ చేశారు.మహిళ బిల్లులో బి.సి. మహిళలకు సబ్ కోటా కల్పించినప్పుడే బి.సి. మహిళల కు  రాజ్యాధికారం దక్కుతుంది అని  అన్నారు. మహిళ బిల్లులో బి.సి మహిళలకు ప్రాతినిధ్యం కల్పించకపోతే మహిళ బిల్లుకు సార్ధకత లేదన్నారు. నేడు బిసి ల గురించి గొంతులు చించుకొని మాట్లాడుతున్నా రాజకీయ పార్టీల నాయకులు బి.సి మహిళల గురించి, మహిళా బిల్లు గురించి వారికి జరుగుతున్న అన్యాయాల గురించి, అత్యాచారాల గురించి  ఎందుకు మాట్లాడటం లేదని లత ప్రశ్నించారు. మహిళ బిల్లు పాస్ కావాలంటే బి.సి మహిళలకు సబ్-కోటా ఇవ్వక తప్పదు. జనాభాలో సగం ఉన్న బి.సి.మహిళలకు కోటా ఇవ్వకుండా మహిళల గురించి మాట్లాడటం అన్యాయమన్నారు.ఈ కార్యక్రమం లో సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి సర్నాల వెంకన్న యాదవ్,సంఘం ఉపాధ్యక్షులు మిర్యాల వెంకటేశం,ఉద్యోగుల సంఘం అద్యక్షులు ఒంగురి నారాయణ యాదవ్, ప్రదాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్,సుంకరి మల్లేష్ గౌడ్,పంకజ్ యాదవ్,కాశి రంలో యాదవ్,తదితరులు పాల్గొన్నారు.అనంతరం 30 మంది మహిళా హెల్త్, వర్దేన్స్, టీచర్స్ లను శాలువా, మేమొంటే లతో ఘనంగా సత్కరించారు.
 
Tags:Savitribai Poole Bikshe – Retired Collector Choleti Prabhakar