మరో పది రోజులు  గడువు విధించిన ఎస్ బీఐ

SBI is the deadline for ten days

SBI is the deadline for ten days

Date:19/11/2018
ముంబై ముచ్చట్లు:
ప్రభుత్వరంగ బ్యాంకు దిగ్గజం ‘స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)’ తన ఖాతాదారులకు డెడ్‌లైన్‌ విధించింది. నవంబరు 30లోగా ఎస్‌బీఐ ఖాతాదారులు మొబైల్‌ నెంబర్‌ను ఖాతాకు అనుసంధానం చేసుకోకపోతే ఆన్‌లైన్‌ సేవలను నిలిపివేయనున్నట్లు మరోసారి హెచ్చరించింది. డిసెంబరు 1 నుంచి కొత్త నిబంధన అమల్లోకి వస్తుందని, కాబట్టి 30లోగా తమ మొబైల్ నంబరును రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఖాతాదారులను కోరింది. ఖాతాదారులు తమ లావాదేవీల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటారని, కాబట్టి బ్యాంకులన్నీ విధిగా ఖాతాదారుల మొబైల్ నంబరును వారి ఖాతాలతో అనుసంధానం చేయాలంటూ భారతీయ రిజర్వు బ్యాంకు జారీచేసిన ఆదేశాల మేరకు తాజాగా, ఎస్‌బీఐ తమ ఖాతాదారులకు సూచనలు చేసింది. మొబైల్ నంబరు అనుసంధానం కాని ఖాతాదారులు నేరుగా బ్యాంకుకు వెళ్లి కానీ, లేదంటే ఏటీఎం ద్వారా కానీ తమ మొబైల్ నంబరును అనుసంధానం చేసుకునే వెసులుబాటును ఎస్‌బీఐ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఖాతాదారులు తమ పాత డెబిట్ (మాగ్‌స్ట్రైప్) కార్డుల స్థానంలో కొత్త (ఈవీఎం చిప్) డెబిట్ కార్డులను తీసుకోవాలని ఎస్‌బీఐ తెలిపింది. కొత్తకార్డుల ద్వారా మోసపూరిత ట్రాన్సాక్షన్లకు అవకాశం ఉండదని తెలిపింది. కొత్త కార్డులకుగాను ఎలాంటి రుసుములు ఉండవు. ఉచితంగానే కార్డును మార్చుకోవచ్చు. ఇదిలా ఉండగా.. ‘యోనో’ యాప్‌ ద్వారా కాగిత రహిత బ్యాంక్‌ ఖాతాలను తెరిచే విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని బ్యాంకు నిర్ణయించింది. ఆధార్‌ వినియోగంపై పరిమితులు విధిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్‌ అధికారి ఒకరు తెలిపారు. డిజిటల్‌ అకౌంట్లను తెరవడానికి ప్రత్యామ్నాయ పరిష్కార సాధనాల వినియోగంపై స్పష్టతనివ్వాల్సిందిగా రిజర్వ్‌ బ్యాంక్‌ను కోరినట్లు వివరించారు.
Tags:SBI is the deadline for ten days

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *