Natyam ad

ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం తీసుకోవాలి

విశాఖపట్నం ముచ్చట్లు:

ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్రం త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కోరారు.విశాఖలో ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ విషయంలో గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంతో చర్చించడం జరిగిందని తెలిపారు. ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లినప్పుడు వర్గీకరణ అంశాన్ని ప్రధాని మోడీ, అమిత్ షా లతో చర్చించి సానుకూల స్పందన తీసుకురావాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కూడా ఎస్సీ వర్గీకరణకు గతంలో హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు.

 

Tags: SC classification should be decided

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.