ఇంటర్ పరీక్షల తీరు తెన్నులను పరిశీలించిన ఎస్సై పురుషోత్తమ రెడ్డి
తిరుపతి ముచ్చట్లు:
జిల్లా సత్యవేడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షల తీరుతెన్నులను శుక్రవారం స్థానిక ఎస్సై పురుషోత్తం రెడ్డి పరిశీలించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో పూర్తిస్థాయిలో పోలీసుల బందోబస్తును ఏర్పాటు చేశారు.ఈ క్రమంలో ఎస్సై పురుషోత్తం రెడ్డి కళాశాల ప్రిన్సిపాల్ అనిల్ కుమార్తో కలిసి విద్యార్థులు రాస్తున్న ఇంటర్ పరీక్షలను పరిశీలించడం జరిగింది.దీంతోపాటు బయట వ్యక్తుల ప్రమేయాలు వంటివి ఉన్నాయి అంటూ పోలీస్ సిబ్బంది అడిగి తెలుసుకున్నారు. పరీక్షా సమయంలో ఎలాంటి మాస్కాపింగ్ ఆస్కారాలు లేకుండా బయట వ్యక్తులు పరీక్ష ప్రాంగణంలోకి రాకుండా నిఘా ఉంచాలని ఎస్సై పురుషోత్తం రెడ్డి పోలీస్ సిబ్బందికి సూచించారు
Tags;SC Purushottama Reddy examined the pattern of the inter exams

