ఎస్సీ  రిజర్వేషన్లు వర్గీకరణ చట్టబద్దత కల్పించాలి

చౌడేపల్లె ముచ్చట్లు:

ఎస్సీ రిజరేషన్లు వర్గీకరణకు చట్టబద్దత కల్పించాలని ఎంఆర్పీఎస్‌, ఎంఎస్పీ  పిలుపు మేరకు చౌడేపల్లె ఎంపీడీఓ కార్యాలయంఆవరణంలో గురువారం  రిలేధీక్ష చేపట్టారు. ఈ సంధర్భంగా  జిల్లా నాయకుడు మాణిక్యం మాట్లాడుతూ  మాదిగల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి మారాలని డిమాండు  చేశారు.  రిజర్షేన్లు వర్గీకరణతోపాటు చట్టబద్దత కల్పించాలన్నారు.ఎస్సీ వర్గీకరణ చేస్తారాలేదా కేంద్ర ం  నిర్ణయాన్ని చెప్పాలంటూ కోరారు.రాజకీయ లబ్దికోసం  మాదిగ కులస్తులకు ద్రోహం చేస్తున్న బిజెపికు పుట్టగతులుండవ్‌ అంటూ నినాదాలు చేశారు. తమ హక్కుల సాధనకోసం మూడు రోజులపాటు దీక్షలు చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో నేతలు మల్లికార్జున,  నరసింహులు,హరిబాబు,నాగభుషణ, గంగిరెడ్డి,రెడ్డెప్ప,శేఖర్‌, రవి, నారాయణ, రమేష్‌, శ్రీరాములు, ఓబులేసు,బాలాజి తదితరులున్నారు.

 

Tags: SC reservation should legitimize the caste

Leave A Reply

Your email address will not be published.