పుంగనూరులో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు
పుంగనూరు ముచ్చట్లు:
భూ వివాదం కేసులో దళిత మహిళ ఇంటిపైకి వెళ్లి దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. ఆదివారం మండలంలోని సింగిరిగుంట గ్రామంలో నివాసం ఉన్న ఎస్.అమ్ములు ఇంటిలో ఉండగా అదే గ్రామానికి చెందిన అప్పిరెడ్డి , వారి కుమారులు మురళి, సురేష్ కట్టెలతో దాడి చేసి, కులంపేరుతో దూషించారని అమ్ములు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఎస్ఐ మోహన్‌కుమార్ కేసు విచారణ చేసి ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags; SC, ST case registered in Punganur
