Natyam ad

జర్నలిజాన్ని బ్రష్టు పట్టిస్తున్న కేటుగాళ్లు

-పతనమౌతున్న పత్రికా విలువలు

-పుట్టుగొడుగుల్లా కొత్త కొత్త పత్రికలు యూట్యూబ్ ఛానళ్ళు

-కనీస అర్హత లేకున్నా విలేకరులుగా దందాలు

Post Midle

-పదేళ్ల క్రితం మీడియా ప్రతినిధుల పదులసంఖ్య లో ఉండేది…కానీ నేడు వందల సంఖ్యలో

-పొట్టకోస్తే అక్షరం ముక్క రాని వాడు కూడా విలేఖరే

-కనీసం వార్త రాయడం కూడా రాని వాడు విలేఖరి అని చెప్పుకుంటూ తిరగడం

-అడ్డదారిలో అక్రిడేషన్లు కొనుగోళ్లు చేసి ప్రజలను నిలువు దోపిడి చేయడం

-అర్హులైన వారికి అందని ద్రాక్షాలా మారిన అక్రిడేషన్లు

 

అమరావతి ముచ్చట్లు:


జర్నలిజం…నాలుగు అక్షరాల ఈ పదం చూడడానికి చిన్నగా ఉన్నా ప్రభావం రాజ్యాలను కూలగొట్టగలదు…నాయకులను మార్చగలదు…దోపిడీ వ్యవస్థను ప్రశ్నించే గొంతుకగా మారగలదు…దేశంలో 1835లోనే పత్రికా రంగం అడుగులు మొదలయ్యాయి. ఆనాటి నుండి నేటి వరకు ఎందరో ప్రతిభావంతులైన మేధావులు జర్నలిజం అనే ఆయుధంతో స్వేచ్ఛ,స్వాతంత్య్రంకై పోరాటాలు చేసిన చరిత్ర జర్నలిస్టులది.మన కళ్ళముందే జరిగిన తెలంగాణ స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాత్రికేయుల పాత్ర చిరస్మరణీయం.అలాంటి గొప్ప రంగంలోకి కొన్ని పంటచేను ను నాశనం చేసే చీడ పురుగుల్లా విలేకరి ముసగువేసుకొని దందాలకు పాల్పడుతున్నారు. ఒకప్పుడు విలేకరుల సంఖ్య పదులసంఖ్య లో ఉండేది…కానీ నేడు వందల సంఖ్యలోకి చేరింది.జీతం లేకుండా ఇంతమంది జర్నలిస్టులుగా సేవలందించడం గొప్ప విషయమే కానీ ఈ సేవల వెనుకున్న స్వార్థం… ఆంతర్యం ఎంటనేది ప్రశ్న. లేని సమస్యని కూడా కొందరు విలేకరులు కల్పిత కథనాలు రాయడం …తీరా ఆరా తీస్తే విలేకరులే చెప్పించారు అని కొన్ని సందర్బాలలో బయటకి వచ్చిన వాస్తవాలు.పొట్ట కూటికి చేసుకునే పనులలో సైతం జోక్యం చేసుకుని వారిని భయబ్రాంతులకు గురి చేసి వారి వద్ద నుండి అందినకాడికి దండుకుంటున్నారు.కొన్ని సందర్బాలలో ఐతే వీరి ఆగడాలు అధికారులకు కొరకరాని కొయ్యలా మారిన సంఘటనలు చోటు చేసుకున్నాయి.

 

 

 

ఉన్న సమస్యలతోనే సతమతవుతున్న తరుణంలో డబ్బుకోసం ఉన్నవీ లేనివి కలిపి వార్త కథనాలుగా రాసి సదరు బాధితులను బ్లాక్మెయిల్ చేసి మరీ నిలువు దోపిడి చేస్తూ ప్రజల పాలిట తీవ్రవాదుల వ్యవహరిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. ఉన్న విలేఖరులే సరిపోలేదంటూ కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్న యూట్యూబ్ ఛానల్ లు వాటికి కూడా ఐడీ కార్డులు వారు కూడా విలేకరులమంటూ దొరికినచోటల్లా దోచుకోవడం. విలేకరి ముసుగులో దందాలు చేస్తూ ఒక వేళ ఎవరైనా ధైర్యంగా ముందుకొచ్చి వీరి ఆగడాలను బయటకు చెప్పే సాహసం చేసినా బెదిరింపులకు పాల్పడుతూ నోరు నొక్కేస్తున్నారు చోఠా మోఠా విలేకర్లు.ఒకప్పుడు విలేకరి అర్హత పొందాలంటే కనీస అర్హత పరీక్షలు…క్రమశిక్షణ తో కూడిన శిక్షణలు ఉండేవి.

 

 

 

అందుకే అనుభవం ఉన్న జర్నలిస్టులు హుందాగా వ్యవహరిస్తారు.నేటి తరంలో చేతిలో స్మార్ట్ ఫోన్ దిక్కూ మొక్కు ఊరూ పేరు లేని చానెళ్ళ ఐడీ కార్డులు తీసుకుని ప్రతీ ఒక్కరూ విలేకరులే అంటూ రోడ్లపై కాలర్ ఎగారేయడం.రేషన్ డీలర్ జర్నలిస్ట్ గా ఉంటాడు తన చౌక దుకాణాలలో జరిగే అక్రమాలు ప్రశ్నించకుండా ఉండాలని…మద్యం దుకాణదారుడూ జర్నలిస్ట్ గా ఉంటాడు తన సిండికెట్ వ్యాపారం బయటపడకుండా ఉండాలని…కాంట్రాక్టర్ జర్నలిస్ట్ అవతారం ఎత్తుతాడు తన నాసిరకపు పనులు ప్రశ్నించొద్దని… అక్రమ మట్టి,ఇసుక రవాణా చేసే వాడు,పురుగుమందు వ్యాపారస్తుడు,బెల్టు షాపు నడిపేవాడు చివరికి డిగ్రీ కూడా ఉత్త్తీర్ణత అవలేని అనర్హులు నేడు పత్రికా రంగంలో ఇబ్బడిముబ్బడిగా తిరుగురున్నారు.నానాటికి కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్న పిడిఎఫ్ పేపర్లు,యూట్యూబ్ చానెల్స్ వెయ్యికి,పదిహేనువందలకు ఐడెంటిటీ కార్డులను జారీ చేసి జర్నలిజాన్ని అమ్ముకునే దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. చిన్న పత్రికలైనా కొన్ని పత్రికలు సమాజ శ్రేయస్సుకోసం, ప్రజల సమస్యలు నాయకుల దృష్టిలో ఉంచే ప్రయత్నం చేస్తున్నాయి.

 

 

 

కానీ మరి కొన్ని పత్రికలు డబ్బు దండుకోవడానికే ద్యేయంగా నడుస్తున్నాయి.కొందరు విలేకర్లు అక్రమ సంపాదనే లక్ష్యంగా పెట్టుకుని జర్నలిజంలోకి అడుగులు వేస్తున్నారు ఇలాంటి ఘటనలు సీనియర్ జర్నలిస్టుల దృష్టిలో ఉన్నప్పటికీ ఇదంతా చూసి చూడనట్లే వ్యవహరిస్తున్నారు.పత్రికా స్వేచ్ఛ ను హరించే హక్కు లేదన్నది ముమ్మాటికీ వాస్తవమే…అయినప్పటికీ పత్రికా రంగంలో ఉన్న ప్రతీ ఒక్కరూ విలువలు కోల్పోకుండా పనిచేయాలి నిజానికి అలా జరగడంలేదు కారణం ప్రశ్నించే హక్కున్నవారే మిన్నకుంటున్నారు కాబట్టి అక్రమార్కులతో చేతులు కలిపి జర్నలిజాన్ని కూడా కలుషితం చేయడంతో రోజు రోజుకీ విలేకరులంటే చిన్న చూపు ఎక్కువైపోతుంది.

 

 

అక్రిడేషన్ కార్డులు అడ్డదారులలో కొనుగోలు చేసి కొందరు అదేదో బ్రహ్మాస్త్రంగా భావించి విచ్చల విడిగా దందాలు చేస్తూ అధికారులను సైతం బురిడీ కొట్టిస్తున్నారు.అసలు ఎటువంటి అర్హత లేని వారి చేతికి అక్రిడేషన్ కార్డులు అమ్ముకుంటున్న కొన్ని మీడియా సంస్థలకు వాటిని అసలు వాళ్లు ఎందుకు వాడుతున్నారు అనేది తెలుసా అసలు…ఐనా వారికి ఎందుకులే మనం అమ్ముకున్నాం వాడు దానితో ఏమి చేస్తే నాకెందుకు అనుకుంటున్నాయి సదరు మీడియా సంస్థలు.అధికారులు కూడా ఇలాంటి వారిపై నిఘా ఏర్పాటు చేయకపోవడం వలన వీరి ఆగడాలు రోజురోజుకూ శృతిమించి పోతున్నాయి. అర్హత ఉన్న వారికి దక్కని అక్రిడేషన్ కార్డులు అక్రమార్కులకు మాత్రం చాలా సులువుగా అందడం కొందరు సీనియర్ విలేఖరులను బాధిస్తున్న విషయం.సంభందిత శాఖల అధికారులు స్పందించి అసలు విలేఖరులు ఎవరు నకిలీ విలేఖరులు ఎవరు అనే నిజాన్ని సమాజానికి తెలియపరిస్తే నిజమైన జర్నలిజాన్ని కాపాడిన వారవుతారు అనేది నూటికి నూరుశాతం నిజం.

 

 

Tags:Scammers who are brushing journalism

Post Midle