పరుగులు పెడుతున్న డిండి ఎత్తిపోతల పథకం

Date:17/08/2019

నిజామాబాద్ ముచ్చట్లు:

డిండి ఎత్తిపోతల పథకంప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి.. దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో సాగునీటి వసతికల్పించడంతోపాటు ఫ్లోరైడ్ విముక్తికి శాశ్వత పరిష్కారం చూపనున్న డిండి ఎత్తిపోతల పథకంలో తొలి ఫలితాన్ని ఈ ఏడాది డిసెంబర్‌లోనే అందించేలా అధికార యంత్రాంగం సైతం తీవ్రంగా శ్రమిస్తోంది. త్వరితగతిన భూ పరిహారం చెల్లింపులు.. ఊపందుకున్న పునరావాస ప్రక్రియ.. వంటి అనేకానేక చర్యలు రైతుల్లో అమితానందాన్ని నింపుతున్నాయి. జిల్లాలోని దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో శాశ్వతంగా సాగునీటి వసతి కల్పించడంతోపాటు ఫ్లోరైడ్ విముక్తికి శాశ్వత పరిష్కారం చూపనున్న డిండి ఎత్తిపోతల(విద్యాసాగర్‌రావు)పథకం పనులు శరవేగంగా సాగుతున్నాయి.

 

 

 

2015 జూన్ 2న సీఎం కేసీఆర్ మర్రిగూడ మండలం చర్లగూడెం వద్ద ఎత్తిపోతలకు శంకుస్థాపన చేశారు. ఇప్పటికే రూ.6,190కోట్లకు ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులు ఇవ్వగా 7 ప్యాకేజీల్లో రూ.3,940కోట్ల వ్యయంతో చేపడుతున్న ఐదు రిజర్వాయర్లతోపాటు 60కి.మీ. మేర ప్రధాన కాల్వ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఎత్తిపోతల పథకం కింద జిల్లాలోనే 3.10లక్షల ఎకరాలకు నీరందిస్తుండగా నాగర్‌కర్నూల్ జిల్లాలో 24వేల ఎకరాలకు, యాదాద్రి భువనగిరి జిల్లాలో మరో 26వేల ఎకరాలకు నీరందంచనున్నారు.

 

 

 

 

ఓ పక్క రిజర్వాయర్ పనులను చేపడుతూనే మరోపక్క ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియ, పునరావాస ప్రక్రియలను ప్రభుత్వం వేగవంతంగా పూర్తిచేస్తోంది. రానున్న రెండేళ్లనాటికి నాటికి పంట కాల్వల ద్వారా ఆయకట్టులోని ప్రతి ఎకరాకు నీరందించేలా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా జిల్లాలో సింగరాజుపల్లి(0.81టీఎంసీ), గొట్టిముక్కల(1.839టీఎంసీ), చింతపల్లి(0.91టీఎంసీ), కిష్ర్టాంపల్లి(5.686టీఎంసీ), శివన్నగూడెం(11.96టీఎంసీ)ల కెపాసిటీతో ప్రభుత్వం రిజర్వాయర్లను నిర్మిస్తోంది.

 

 

 

 

నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో ఎర్రబెల్లి, గోకారం వద్ద 1.095టీఎంసీలతో ఒక రిజర్వాయర్‌ను, రంగారెడ్డి జిల్లా ఇర్విన్ వద్ద 0.447టీఎంసీల సామర్థ్యంతో మరో రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నారు. గొట్టిముక్కల రిజర్వాయర్ పనులు ఇప్పటికే 60శాతానికి పైగా పూర్తికాగా, సింగరాజుపల్లి రిజర్వాయర్ పనులు 40శాతం వరకు పూర్తయ్యాయి. కిష్ర్టాంపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్ పనులు కూడా ఆశించిన స్థాయిలో కొనసాగుతున్నాయి. ఎర్రబెల్లి, గోకారం- ఇర్విన్ రిజర్వాయర్ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.

 

 

 

 

డిండి ఎత్తిపోతల పథకంలో భూసేకరణ ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ్ద కనబరుస్తోంది. భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన రైతులకు తక్షణమే పరిహారం చెల్లింపులు జరుపుతోంది. పట్టా భూములతో పాటు అసైన్డ్ భూములకు కూడా ప్రభుత్వం పరిహారం చెల్లిస్తోంది. 5 రిజర్వాయర్ల పరిధిలో 10,375 ఎకరాలు సేకరించాల్సి ఉండగా ఇప్పటివరకు 5,354 ఎకరాలను రైతుల నుంచి సేకరించారు. సేకరించాల్సిన భూమిలో 1,436 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండగా, మరో 1,156ఎకరాల అసైన్డ్‌ల్యాండ్ ఉంది.

 

 

 

 

గొట్టిముక్కల రిజర్వాయర్ పరిధిలో 1,790 ఎకరాలకు గాను 1,420 ఎకరాలను సేకరించారు. సింగరాజుపల్లి రిజర్వాయర్ పరిధిలో 699 ఎకరాలకుగాను 684 ఎకరాలను, కిష్ర్టాంపల్లి రిజర్వాయర్ పరిధిలో 2,045 ఎకరాలకుగాను 1,389 ఎకరాలను, చింతపల్లి రిజర్వాయర్ పరిధిలో 1,689ఎకరాలకుగాను 366 ఎకరాలను, శివన్నగూడెం రిజర్వాయర్ పరిధిలో 3,314 ఎకరాలకుగాను 1,488 ఎకరాల్లో భూ సేకరణ పూర్తయ్యింది. ఇప్పటివరకు రైతులకు భూ పరిహారం కింద రూ.400కోట్ల వరకు ప్రభుత్వం చెల్లింపులు జరిపింది.

యదేఛ్చగా అక్రమ వెంచర్లు..అధికారుల దాడులు

 

Tags: Scheme of Running Dindy Waivers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *