Natyam ad

లారీని ఢీకొన్న స్కూలు బస్సు..విద్యార్దులకు స్వల్ప గాయాలు

విజయవాడ ముచ్చట్లు:
విజయవాడ   సమీపoలోని తుమ్మల పాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తుమ్మలపాలెం క్రాస్రోడ్డు వద్ద కారును తప్పించబోయిని లారీ  డ్రైవర్ సడెన్ గా  బ్రేక్ కొట్టాడు. దాంతో లారీ వెనుక వస్తున్న ఎం.వి.ఆర్ కాలేజ్ బస్సు  లారీ ని బలంగా  ఢీకొంది. బస్సు డ్రైవర్ వెనక పక్కన ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. బస్సులో సుమారు 40 మంది విద్యార్థులు వున్నారు. అదృష్టవశాత్తూ విద్యార్థులు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. ఘటనలో భారీగా ట్రాఫిక్ జాం అయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: School bus collides with lorry, causing minor injuries to students