స్కూల్‌ బస్సులు ఫిట్‌నెస్‌ లేకపోతే సీజ్‌ చేస్తాం- ఎంవిఐ సుప్రియ

పుంగనూరు ముచ్చట్లు:

పాఠశాలలు, కళాశాలలకు చెందిన బస్సులు, వ్యాన్లకు యాజమాన్యాలు ఖచ్చితంగా ఫిట్‌నెస్‌ చేసుకుని సర్టిఫికెట్‌ తీసుకోవాలని లేకపోతే వాహనాలను సీజ్‌ చేస్తామని ఎంవిఐ సుప్రియ హెచ్చరించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ పుంగనూరు ఆర్టీఏ పరిధిలో  మొత్తం 44 బస్సులు ఉందన్నారు. డీటీసీ నిరంజన్‌రెడ్డి ఆదేశాల మేరకు బస్సులు, వ్యాన్లు , ఎఫ్‌సీ, పర్మిట్లు , ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లతో పాటు డ్రైవర్లకు లైసెన్సులు ఖచ్చితంగా ఉండాలన్నారు. ఇప్పటి వరకు 24 బస్సులకు ఎఫ్‌సి చేయడం జరిగిందన్నారు. మిగిలిన వాహనాలకు ఎఫ్‌సి చేసేందుకు యాజమాన్యాలు తీసుకురావాలన్నారు. పాఠశాలలు , కళాశాలలు తెరిచేలోపు వాహనాలు ఎఫ్‌సి చేసుకోవాలన్నారు. లేకపోతే వాహనాలను రోడ్డుపై అనుమతించే ప్రసక్తే లేదని ఆమె హెచ్చరించారు. అలాగే పన్ను బకాయిదారులు తక్షణమే పన్నులు చె ల్లించాలన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు వాహనాలను నడిపేందుకు అనుమతించవద్దన్నారు. ఈ విషయమై తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చిన్నపిల్లలు రోడ్డుపై వాహనాలను నడిపితే సీజ్‌ చేసి , తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. రహదారి భద్రత, సూచనలను పాటిస్తూ ప్రతి ఒక్కరు ప్రయాణించాలని కోరారు.

 

Tags: School buses will be seized if they are not fit – MVI Supriya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *