బడి పిల్లల బాధ్యత అందరిది

విశాఖపట్నం ముచ్చట్లు:

బడి పిల్లల భద్రత అందరి బాధ్యతని కలెక్టర్‌ మల్లికార్జున అన్నారు.విశాఖ నగరంలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలోని ఆడిటోరియంలో జరిగిన స్కూల్‌ సేఫ్టీ మేనేజ్‌మెంట్‌ వర్క్‌ షాప్‌లో ఆయన మాట్లాడారు. ఇటీవల జరిగిన బడి పిల్లల ఆటో ప్రమాదం తనను తీవ్రంగా కలిచివే సిందన్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకూడదదన్నారు. బడికి వచ్చే పిల్లల ప్రయాణ సాధనాలపై ఆయా పాఠశాలల యాజమాన్యాలు తప్పకుండా అవగాహన కలిగి ఉండాలని, వారు ఇంటికి క్షేమంగా చేరుకునే వరకు యాజమాన్యాలే బాధ్యత తీసుకోవాలని సూచించారు. పిల్లల భద్రత విషయంలో చిన్నపాటి నిర్లక్ష్యం వహించినా ఉపేక్షించేది లేదని, క్రిమినల్‌ చర్యలు తీసుకుం టామని కలెక్టర్‌ హెచ్చరించారు. భవిష్యత్తులో తప్పులు జరిగితే లైసెన్స్‌ రద్దు చేస్తామన్నారు.రానున్న రోజుల్లో విశాఖ జిల్లాకు ప్రాముఖ్యత చాలా పెరుగుతుందని అందరి దృష్టి జిల్లాపై ఉందన్నారు. ఏ చిన్నపాటి సంఘటన జరిగినా, అది రాష్ట్ర వ్యాప్త చర్చసాగే అవకాశం ఉందని ప్రతీ ఒక్కరూ గుర్తుంచు కోవాలన్నారు. విద్యుత్‌ తీగలు, స్విచ్‌ బోర్డులు పిల్లలకు అందుబాటులో లేకుండా చూసుకోవాలన్నారు.

 

Tags: School children are everyone’s responsibility

Post Midle
Post Midle