Natyam ad

పాఠశాల విలీనం వెంటనే ఆపాలి

అనంతపురం ముచ్చట్లు:

అనంతపురం జిల్లా, కుందుర్పి మండలం, మాయదార్లపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలోని 6,7,8 తరగతులను బసాపురం ఉన్నత పాఠశాలలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ 50 రోజులుగా పాఠశాలను ముసివేసినా కూడా అధికారులు పట్టించుకోకుండా ఉండడం వల్ల ఈ రోజు పాఠశాల విద్యార్థులు, గ్రామస్తులు మాయదార్లపల్లి గ్రామం లోని వాల్మీకి మహర్షి విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. మా పాఠశాల పూర్తిగా ముసివేయడం వల్ల 50 రోజులుగా మాకు మధ్యాహ్న భోజనం, కోడిగుడ్లు, చిక్కీలు కూడా అందలేదు, మా బాధలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక చివరికి మేమంతా దేవునిగా కొలిచే వాల్మీకి మహర్షి గారికి వినతిపత్రం ఇచ్చి మా బాధలు చెప్పుకుంటున్నాము అని, ఇప్పటికైనా మా మామయ్య మా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  స్పందించి మా పాఠశాల లోని 6,7,8 తరగతులను విలీనం చేయకుండా చూడాలని, మేమంతా బాగా చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకొని మాయదార్లపల్లి గ్రామానికి మంచిపేరు తీసుకువస్తామని పాఠశాల విద్యార్థులు తమ బాధలను చెప్పుకున్నారు.

 

Tags: School merger should be stopped immediately

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.