పుంగనూరులో స్కూల్ స్థలం వివాదం పరిష్కారం
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు రూరల్ మండలంలోని నేతిగుట్లపల్లె పంచాయతీ షీకారిపాళ్యెంలో స్కూల్ స్థలం వివాదం పరిష్కారమైంది. గురువారం ఎంపిపి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, మాజీ ఎంపిపి నరసింహులు, మంత్రి పిఏ మునితుకారం తో పాటు అధికారులు గ్రామాన్ని సందర్శించి, పాఠశాల స్థల వివాదాన్ని గ్రామస్తులతో చర్చించి, పరిష్కరించారు. ఎంపిపి మాట్లాడుతూ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్కూల్ భవనానికి రూ.33 లక్షలు మంజూరు చేశారని తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. సమస్య పరిష్కారం కావడంతో షీకారిలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్ధార్ వెంకట్రాయులు, ఎంపీడీవో లక్ష్మీపతి, సర్పంచ్ సురేంద్ర, ఎంపిటిసి పురుషోత్తం, ఏఎంసీ మాజీ చైర్మన్ అమరనాథరెడ్డి, మండల పార్టీ కార్యదర్శి రామకృష్ణారెడ్డి, పోలీసులు పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: School place dispute resolution in Punganur