స్కూల్ వ్యాన్ బోల్తా..విద్యార్దులకు గాయాలు
నెల్లూరు ముచ్చట్లు:
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెం మండలం మినగల్లు గ్రామం వద్ద స్కూల్ బస్ బోల్తా పడింది. ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి. సాల్మాన్ పురంతోపాటు మినగల్లు గ్రామం నుండి విద్యార్థులను ఎక్కించుకొని బుచ్చిరెడ్డి పాలెం లోని స్కూల్ కి వెళుతుండగా ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి పక్కనే వున్న పంట పొలాల్లోకి పల్టీ కొట్టింది. బస్సులో 20 మంది విద్యార్థులు ఉండగా వారిలో ముగ్గురు విద్యార్థులకు గాలైయ్యాయి. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం బుచ్చిరెడ్డిపాలెంకు తరలించారు. డ్రైవర్ అక్కడి నుండి పరారయ్యాడు. పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.
Tags: School van overturns..Students injured

