జూలై 1 నుంచి స్కూల్స్

హైదరాబాద్ ముచ్చట్లు :

 

తెలంగాణలో స్కూళ్లు, కాలేజీల పున:ప్రారంభం విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జూన్ 20వ తేదీ నుంచి లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేస్తూ తెలంగాణ స‌ర్కార్ నిర్ణయం తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో విద్యాసంస్థల పునఃప్రారంభంపై కూడా కేబినెట్ భేటీలో చర్చించారు. జులై 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జులై 1 నుంచి అన్ని రకాల విద్యాసంస్థలను ప్రారంభించాలని విద్యాశాఖ అధికారుల‌ను మంత్రివర్గం ఆదేశించింది. పూర్తిస్థాయి సన్నద్థతతో విద్యాసంస్థలను పున:ప్రారంభించాలని స్ఫష్టం చేసింది.మరోవైపు, తెలంగాణ‌లో లాక్ డౌన్‌ను పూర్తిగా ఎత్తివేశారు. ఈ మేరకు లాక్ డౌన్‌ను పూర్తిగా ఎత్తేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో కరోనా పూర్తి నియంత్రణలోకి రావడంతోనే వైద్యశాఖ అధికారులు ప్రతిపాదన మేరకు లాక్ డౌన్‌ను ఎత్తి వేయాలని నిర్ణయించారు.

 

 

 

 

లాక్ డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను మంత్రివర్గం ఆదేశించింది.లాక్ డౌన్ ఎత్తివేసినంత మాత్రాన కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదంది. తప్పని సరిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, శానిటైజర్ ఉపయోగించడం.. తదితర కరోనా స్వీయ నియంత్రణ విధానాలను విధిగా పాటించాలంది. అందుకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలను అనుసరించాలని కేబినెట్ స్పష్టం చేసింది. కరోనా పూర్తిస్థాయి నియంత్రణకు ప్రజలు త‌మ‌ సంపూర్ణ సహకారం అందించాలని కేబినెట్ కోరింది.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags: Schools from July 1st

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *