పంజాబ్, యూపీల్లో స్కూళ్లు తెరిచారు

Date:20/10/2020

న్యూఢిల్లీ ముచ్చట్లు:

కోవిద్ కారణంగా మూతబడ్డ స్కూళ్లు, కాలేజీలు ఇప్పటికే తెరచుకుంటూ ఉన్నాయి. చాలా రాష్ట్రాలు స్కూళ్లు తెరవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. తాజాగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, పంజాబ్ రాష్ట్రాల్లో స్కూళ్లు తెరుచుకున్నాయి. మరీ చిన్న పిల్లలను స్కూళ్లకు అనుమతించలేదు. ముందు జాగ్రత్త చర్యగా క్లాసులను శానిటైజ్ చేశారు. కోవిద్-19 నిబంధనలను విద్యార్థులంతా పాటించేలా చర్యలు తీసుకున్నారు.  యూపీలో ఏడు నెల‌ల త‌ర్వాత పాఠ‌శాల‌ల‌ను తెరిచారు.  9 నుంచి 12వ త‌ర‌గ‌తి విద్యార్థులు హాజరయ్యారు.  కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ విద్యార్థులు స్కూళ్ల‌కు వెళ్తున్నారు. యూపీలోని లక్నోతో పాటు ఇత‌ర ప్ర‌ధాన ప‌ట్ట‌ణాల్లో స్కూళ్ల‌ను ఓపెన్ చేశారు. కొందరు స్కూళ్ల‌కు హాజ‌రవ్వగా.. మిగిలిన విద్యార్థుల‌కు ఆన్‌లైన్‌లో పాఠాలు నేర్పుతున్నారు.  పంజాబ్‌లో 9 నుంచి 12 త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు కేవ‌లం డౌట్ క్లారిఫికేష‌న్ క్లాసుల‌ను తీసుకుంటున్నారు. స్కూళ్ల‌లో ఆన్‌లైన్ క్లాసులు కూడా ఉండేలా చూశారు.  9, 10వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ఉద‌యం 8 నుంచి 11 గంట‌ల వ‌ర‌కు,  మ‌ధ్యాహ్నం 12 నుంచి 3 వ‌ర‌కు 11, 12వ త‌ర‌గ‌తుల‌కు క్లాసులు తీసుకోనున్నారు. కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ స్కూళ్ల‌ను నిర్వ‌హిస్తున్నారు. చాలా మంది తల్లిదండ్రులు ఇంకా తమ పిల్లలను స్కూళ్లకు, కాలేజీలకు పంపించాలని అనుకోవడం లేదు. చాలా రాష్ట్రాల్లో ఇంకొద్ది రోజులు ఆన్ లైన్ క్లాసులు మాత్రమే నిర్వహించడని తల్లిదండ్రులు కోరుతూ ఉన్నారు. లాక్ డౌన్ కారణంగా కేవలం ఆన్ లైన్ పాఠాలు చెబుతూ ఉండగా.. సిలబస్ విషయంలో బోర్డులు చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే సగం సిలబస్ ను తగ్గించారు. తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లను నవంబర్ తర్వాత తెరవాలని అనుకుంటూ ఉన్నారు.  భారత్ లో కరోనా కేసుల సంఖ్య  75 లక్షలు దాటింది. గత 24 గంటల్లో 55,722 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 75,50,273 కి చేరింది. గ‌త 24 గంట‌ల సమయంలో 579 మంది కరోనా కారణంగా మృతి చెందడంతో మృతుల సంఖ్య 1,14,610 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటి వరకు 66,63,608 మంది కోలుకున్నారు. 7,72,055 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.

శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం లో నాలుగవ రోజు పార్వతీదేవి అలంకారం

Tags: Schools opened in Punjab and UP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *