Natyam ad

ఏపీలో స్కూల్స్ వాయిదా

విజయవాడ ముచ్చట్లు:


ఏపీలో స్కూల్ విద్యార్థులకు అలెర్ట్. రాష్ట్రంలో పాఠశాలల పునః ప్రారంభాన్ని జగన్ సర్కార్ వాయిదా వేసింది. వేసవి సెలవుల అనంతరం జూలై 4న తెరుచుకుంటాయని తొలుత ప్రకటించారు.  అయితే తాజాగా స్కూల్స్ జూలై 5 న తిరిగి ప్రారంభం అవుతాయని ప్రభుత్వం వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖకు సూచనలు వెళ్లాయి. ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా స్వాతంత్య్ర విప్లవ వీరుడు అల్లూరికి ఘన నివాళి అర్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు వస్తుండటంతో పాఠశాలల రీ-ఓపెన్ డేట్‌ని  వాయిదా వేయాలని నిర్ణయించారు. దీంతో రాష్ట్రంలో పాఠశాలలన్నీ జూలై 5న తెరుచుకోనున్నాయి.  ప్రతి ఏడాది జూన్‌లో విద్యాసంస్థలను ప్రారంభించడం ఆనవాయితీ. ఐతే  2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి పరీక్షల నిర్వహణ, మూల్యాంకన ప్రక్రియలు కొంత ఆలస్యంగా జరిగినందున 2022-23 విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభం అవ్వనుంది.కాగా వచ్చే నెల 4న ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. విశాఖ, భీమవరం, గుంటూరు జిల్లాలలో ప్రధాని టూర్ ఉండనుంది. తొలుత విశాఖలో జరిగే బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. అనంతరం భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. అంతేకాకుండా మంగళగిరిలోని ఎయిమ్స్ ప్రారంభోత్సవంలోనూ ప్రధాని పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర నాయకత్వం తెలిపింది.

 

Tags: Schools postponed in AP

Post Midle
Post Midle