Natyam ad

శ్రీకాళహస్తి కొండమీటలోని శ్రీ సాయిరాం చిల్డ్రన్ స్కూల్స్లో సైన్స్ దినోత్సవం

శ్రీకాళహస్తి ముచ్చట్లు:

శ్రీకాళహస్తి కొండమీటలోని శ్రీ సాయిరాం చిల్డ్రన్ స్కూల్స్లో సైన్స్ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు విచ్చేసి సైన్స్ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. సైన్స్ దినోత్సవ కేకును శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు కట్ చేసి చిన్నారులకు పంపిణీ చేసి ఆనందోత్సాహంతో పిల్లలను ప్రోత్సహించారు.ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు ఉన్న చిన్నారులు తమ ఆలోచన ధోరణితో విభిన్న వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేశారు. దేవస్థానం చైర్మన్ ఎగ్జిబిషన్ ను తిలకించి చిన్నారులను అభినందించారు. ప్రత్యేకంగా శ్రీకాళహస్తి ఆలయ రాజగోపురాన్ని పచ్చదనంతో శోభించేలా చూపించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ చిన్నారులు సైన్స్ పట్ల మక్కువతో అర్థం చేసుకొని ఉన్నతి విద్య అభ్యసిస్తూ… శ్రీ జ్ఞాన పుసునాంబ సమేత శ్రీకాళహస్తిశ్వరుని అనుగ్రహంతో ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షించారు.

 

Post Midle

Tags: Science Day at Sri Sairam Children’s School, Srikalahasti Kondameeta

Post Midle