Natyam ad

చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల‌కు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

చంద్రగిరి ముచ్చట్లు:

చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 17 నుండి 25వ తేదీ వరకు జ‌రుగ‌నున్న బ్రహ్మోత్సవాలకు మంగ‌ళ‌వారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ జ‌రిగింది.ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి పరివార దేవతలకు తిరుమంజనం నిర్వహించారు. అనంతరం సాయంత్రం 6 నుండి అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాల్లో భాగంగా సేనాధిపతి ఉత్సవం, మృత్సంగ్రహణం, మేదినిపూజ, తదితర కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు పాల్గొన్నారు.

Post Midle

ఏప్రిల్ 17న ధ్వ‌జారోహ‌ణం

శ్రీ కోదండ రామస్వామివారి వార్షిక‌ బ్రహ్మోత్సవాల‌కు ఏప్రిల్ 17న ఉద‌యం 9.05 నుండి 10 గంట‌ల మ‌ధ్య వృష‌భ‌ ల‌గ్నంలో ధ్వ‌జారోహ‌ణం జ‌రుగ‌నుంది.

 

Tags: Scientific initiation of Chandragiri Shri Kodandaramaswamy’s Brahmotsavam

Post Midle