Natyam ad

శ్రీ వ‌కుళ మాత ఆల‌యంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం

తిరుప‌తి ముచ్చట్లు:

 

తిరుప‌తి స‌మీపంలోని పాత‌కాల్వ ( పేరూరు బండ‌పై) వద్ద వున్న శ్రీ వ‌కుళ‌ మాత ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం నిర్వహించారు.ఇందులో భాగంగా ఆలయాన్ని శుద్ధి చేసి, పసుపు, కుంకుమ, చందనం, సీకాయ, కర్పూరం, కిచిలిగడ్డ, కస్తూరి పసుపు, పచ్చాకు తదితరాలతో తయారుచేసిన సుగంధ మిశ్రమాన్ని గర్భాలయ గోడలకు ప్రోక్ష‌ణ చేశారు.

జూన్ 13న వార్షికోత్సవం :

Post Midle

జూన్ 13 వతేదీ శ్రీ వకుళ మాత ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఉద‌యం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు విశ్వక్సేనారాధన, పుణ్యాహవ‌చ‌నం, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ట, కలశారాధన, మహా శాంతి హోమం, పూర్ణాహుతి , అమ్మవారి ఉత్సవరులకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహించనున్నారు.ఈ కార్య‌క్రమంలో ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో  వరలక్ష్మి, ఏఈవో గురుమూర్తి, టెంపుల్ ఇన్స్పెక్టర్  శివప్రసాద్ పాల్గొన్నారు.

 

Tags:Scientific Koil Alwar Thirumanjanam at Sri Vakula Mata Temple

Post Midle