శ్రీ వ‌కుళామాత‌ ఆలయంలో శాస్త్రోక్తంగా క్షీరాధివాసం

తిరుప‌తి ముచ్చట్లు:

తిరుప‌తి స‌మీపంలోని పాత‌కాల్వ (పేరూరు పండ వ‌ద్ద )లో టీటీడీ నిర్మించిన శ్రీ వ‌కుళామాత‌ ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణ కార్యక్రమాల్లో భాగంగా సోమ‌వారం ఉదయం క్షీరాధివాసం నిర్వహించారు.ఇందులో భాగంగా ఉద‌యం 8.30 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు విష్వక్సేన పూజ, పుణ్యాహ‌వ‌చ‌నం, అగ్నిప్ర‌ణ‌య‌నం, క‌ల‌శారాధ‌న‌, ఉక్త‌హోమాలు, న‌వ‌క‌ల‌శ‌ స్న‌ప‌న క్షీరాధివాసం నిర్వ‌హించారు. అమ్మ‌వారి విగ్ర‌హ‌నికి వేద మంత్రాల మ‌ధ్య పాల‌తో విశేషంగా అభిషేకం (క్షీరాధివాసం) చేయ‌డం వ‌ల్ల దోషాలు తొల‌గిపోతాయ‌ని అర్చ‌కులు తెలిపారు.సాయంత్రం 6.30 నుండి రాత్రి 9.30 గంటల వ‌ర‌కు క‌ల‌శారాధ‌న‌, విశేష హోమాలు, వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు.ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో గుణ భూషణ్ రెడ్డి, ఆగమ సలహా దారు  వేదాంతం విష్ణు భట్టాచార్యులు, ఇత‌ర అధికారులు, రుత్వికులు పాల్గొన్నారు.

Post Midle

Tags:Scientific lactation at Sri Vakulamata Temple

Post Midle
Natyam ad