శాస్త్రోక్తంగా శ్రీ వ‌కుళమాత ఆల‌య మండ‌లాభిషేకం

తిరుప‌తి ముచ్చట్లు:

తిరుప‌తి స‌మీపంలోని పాత‌కాల్వ(పేరూరు బండ) వ‌ద్ద‌గ‌ల శ్రీ వ‌కుళమాత ఆల‌య మండ‌లాభిషేకం మంగ‌ళ‌వారం శాస్త్రోక్తంగా జ‌రిగింది. ముందుగా గర్భాలయంలో శ్రీ వకుళమాత మూలమూర్తికి, ఉత్సవమూర్తికి అభిషేకం చేశారు. అనంతరం ఉత్సవమూర్తిని యాగశాలకు వేంచేపు చేసి కలశస్థాపన, కలశపూజ, పుణ్యాహ‌వ‌చ‌నం, విష్వక్సేనారాధన, సంకల్పం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శాంతి హోమం చేపట్టారు. టిటిడి వైఖానస ఆగమ సలహాదారు శ్రీ వేదాంతం విష్ణుభట్టాచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు, టిటిడి బోర్డు సభ్యులు పోకల అశోక్ కుమార్, ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈఓ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Tags: Scientifically Sri Vakulamata Temple Mandalabhishekam

Leave A Reply

Your email address will not be published.