శాస్త్రోక్తంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వసంతోత్సవాలు

తిరుపతిముచ్చట్లు :

 

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు ఆదివారం రెండో రోజుకు చేరుకున్నాయి. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఈ ఉత్స‌వాల‌ను ఆల‌య ప్రాంగ‌ణంలోనే ఏకాంతంగా నిర్వహించారు.ఇందులో భాగంగా మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు శ్రీ భూ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రినీళ్లు, ప‌సుపు, చందనంలతో అభిషేకం చేశారు.కాగా వసంతోత్సవాల్లో చివ‌రి రోజైన సోమ‌వారం మ‌ధ్యాహ్నం 1.30 నుండి 3.30 గంటల వరకు ఆల‌య ముఖ‌‌ మండపంలో శ్రీ భూ స‌మేత క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు, శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయస్వామి వారికి, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వ‌హించ‌నున్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో  శాంతి, ఏఈవో  ధ‌నంజ‌యుడు, సూపరింటెండెంట్  చెంగ‌ల్రాయులు, ఆల‌య అర్చ‌కులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Scientifically the spring festivals of Sri Kalyana Venkateswaraswamy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *