సింహగిరి పై శాస్త్రోక్తంగా వృశ్చిక దీపారాధన
ప్రత్యేక పూజలు, ఘనంగా ఉత్సవం
సింహాచలం ముచ్చట్లు:
సింహాచలం శ్రీ వరహా లక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలో మార్గశిర మాసం పౌర్ణమి సందర్భంగా వృచ్చిక దీపారాధన ఉత్సవము ఘనముగా నిర్వహించారు. ఈ సందర్భంగా సింహాద్రినాథుడు శ్రీదేవి ,భూదేవి అమ్మవార్లను సర్వాభరణాలతో అందంగా తీర్చిదిద్దారు.. అనంతరం ఆలయ ఆస్థాన మండపంలో రాత్రి ఆరాధనలో భాగంగా ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. తదుపరి శాస్త్రాక్తంగా వృశ్చిక దీపారాధన కార్యక్రమాన్నిజరిపించారు. భక్తులందరూ దీపారాధనలు చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లను వేద మంత్రాలు, మృదు మధుర మంగళ వాయిద్యాల మధ్య మాడ వీధుల్లో తిరువీధి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయము బయట చొప్పోత్సవం ఉత్సవాన్ని ఘనంగా జరిపించారు.. ఆలయ స్థానాచార్యులు టిపి రాజగోపాల్, పురోహితులు కరి సీతారామాచార్యులు, హవల్దార్ సాతులూరు సూర్యనారాయణ ఆచార్యులు, అప్పాజీ, అర్చక స్వాములు ,భక్తులు పాల్గొన్నారు.

ఘనంగా అప్పన్న నిత్య కళ్యాణం
సింహాద్రి నాథుడు ఆర్జిత సేవల్లో భాగంగా నిత్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిపించారు. సింహాద్రి నాథుడు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను సర్వాభరణాలతో అందంగా అలంకరించారు. అనంతరం ఆలయ ఆస్థాన మండపంలో అందంగా తీర్చిదిద్దిన కల్యాణవేదికపై స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని వైభవముగా జరిపించారు. పాల్గొన్న భక్తులందరికీ తీర్థప్రసాదాలు అందజేశారు .. మార్గ శిర మాసము, పౌర్ణమి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు సింహాద్రినాధుడు నీ దర్శించుకున్నారు.
Tags: Scientifically Vrischika Dipradhana on Simhagiri
