స్క్రిప్ట్ రైటర్లతో జాగ్రత్తగా ఉండాలి

Script must be careful with writers

Script must be careful with writers

Date:15/08/2018
హైదరాబాద్  ముచ్చట్లు:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయంపై తప్పుడు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ట్విట్టర్ వేదికగా సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. స్క్రిప్ట్ రైటర్లతో జాగ్రత్తగా ఉండాలని రాహుల్‌కు హరీశ్‌రావు సూచించారు.కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ పేరుతో అంచనా వ్యయాన్ని రూ. 38 వేల కోట్ల నుంచి రూ. లక్ష కోట్లకు పెంచారని రాహుల్‌కు స్క్రిప్ట్ రైటర్లు చెప్పారు.
మరి ప్రాణహిత – చేవెళ్ల తొలి జీవో రూ.17 వేల కోట్లకు జారీ చేసిన విషయాన్ని కాంగ్రెస్ నేతలు మరిచిపోయారు. ఏడాది వ్యవధిలోనే కనీసం ప్రాజెక్టు పనులు మొదలుపెట్టకముందే 2008లో రూ. 38 వేల కోట్లకు 2010లో రూ. 40 వేల కోట్లకు డీపీఆర్ సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టు వ్యయం ఆ విధంగా ఎందుకు పెంచారో రాహుల్ చెప్పగలరా. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.80 వేల 190 కోట్లకు సీడబ్ల్యూసీ ఆమోదించింది. రూ. లక్ష కోట్లకు కాదు.
ఈ విషయం రాహుల్ గాంధీ స్క్రిప్ట్ రైటర్లకు తెలియదా అని హరీశ్‌రావు ప్రశ్నించారు.రీడిజైన్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌ను సీడబ్ల్యూసీ ఆమోదించి.. కేవలం ఏడాది వ్యవధిలోనే అన్ని అనుమతులను ఇచ్చిందని మంత్రి గుర్తు చేశారు. మన దేశంలో నీటి ప్రాజెక్టులకు సంబంధించి సీడబ్ల్యూసీ అనేది అపెక్స్ బాడీ.. జలవనరుల శాఖకు ఇది అనుబంధం. ఈ విషయంపై రాహుల్‌కు,ఆయన స్క్రిప్ట్ రైటర్లకు అవగాహన ఉందాఅని హరీశ్‌రావు అడిగారు.
అలాంటి అత్యున్నత కమిషన్ విశ్వసనీయతను రాహుల్ ఎలా అనుమానిస్తారని ప్రశ్నించారు. అంబేడ్కర్ ప్రాజెక్టు పేరును తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చిందని రాహుల్ గాంధీ చెప్పారు. ఈ విషయంలో కూడా రాహుల్‌ను స్క్రిప్టు రైటర్లు తప్పుదోవ పట్టించారు. ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే అంబేడ్కర్ ప్రాణహిత ప్రాజెక్టు అలాగే ఉందన్నారు హరీశ్ రావు.
Tags:Script must be careful with writers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *