తాటికి బంజారాల సెగ

Seal of palm fronds

Seal of palm fronds

చెప్పులతో తరిమికోట్టిన లంబాడాలు
Date:23/11/2018
భద్రాద్రి ముచ్చట్లు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం  అశ్వరావుపేట నియోజకవర్గ తెరాస అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు ప్రచార వాహనాన్ని పోకలగూడెం గ్రామంలో లంబాడా గిరిజనులు అడ్డుకున్నారు. లంబాడీలను ఎస్టీ జాబితాలో నుండి తొలగించాలని తాటి వెంకటేశ్వర్లు ప్రయత్నించారని అప్పటి ముద్రించిన కరపత్రాలను చూపిస్తూ వాహనాన్ని అడ్డుకున్నారు ఈ నేపథ్యంలో తెరాస కార్యకర్తలకు గ్రామస్తులకు వాగ్వివాదం చోటు చేసుకుని తోపులాట జరిగింది. గ్రామస్తులు తాటిపైకి రాళ్లు సైతం రువ్వారు. చెప్పులను చూపిస్తూ మా గ్రామానికి ఏ అభివృద్ధి చేశారు అంటూ గెలిచిన నాటినుండి ఇప్పటివరకు మా గ్రామానికి రాలేదని మీకెందుకు వేయాలి ఓటు అంటూ నిలదీశారు. ఈ సమయంలో స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళన కారులను నచ్చచెప్పి తాటి ప్రచార రథాన్ని ముందుకు సాగనంపారు.
Tags:Seal of palm fronds

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *