అరటి గిట్టుబాటు కోసం ఆరాటం

Seasoning for banana benefits

Seasoning for banana benefits

Date:13/04/2018
రాజమండ్రి  ముచ్చట్లు:
తూర్పుగోదావరి జిల్లాలోని రావులపాలెం అరటి వ్యాపారానికి ప్రధాన వాణిజ్య కేంద్రంగా మారింది. ఇక్కడ వున్న అరటి మార్కెట్‌ యార్డు ఆసియాలోనే రెండవ స్ధానం ఆక్రమించుకుంది.  అయితే రైతులు మాత్రం  గిట్టుబాటు ధర లేక నష్టాల పాలౌతున్నారు..అరటి రైతుల సమస్యలపై ప్రత్యేక కధనం… తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలలో 6వేల ఎకరాలలో అరటి పంటను పండిస్తున్నారు. ప్రతి రోజు 20,000 నుండి 25,000 వరకు అరటి గెలలు మార్కెట్‌కు వస్తుంటాయి. కర్పూర రకంతో పాటు చక్రకేళి, పచ్చఅరటి , ఎర్ర చక్రకేళి, తెల్ల చక్రకేళి, బుషావళి, అమృతపాణి, బొంత వంటి కూర అరటి వంటి రకాలు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మద్రాస్‌,ఒరిస్సా, కటక్‌, భువనేశ్వర్‌ ప్రాంతాలకు ఎగుమతి అవుతుంటాయి. ఈ యార్డు  కొన్ని వేలమంది కార్మికులకు ఉపాధికలిగిస్తుంది. అయితే ఈ మార్కెట్‌ యార్డులో ఎటువంటి రుసుము లేకుండా గిట్టుబాటు రేటుకు రైతు స్వయంగా అమ్ముకునే వీలు కల్పిస్తున్నప్పటికీ, క్షేత్రస్ధాయిలో  దళారుల కబందహస్తాలలో సామాన్య అరటి రైతు నలిగిపోతూ.. పెట్టినపెట్టుబడికి తగిన గిట్టుబాటు ధర రాని పరిస్ధితి నెలకొన్నది. ఈ దళారీ వ్యవస్ధ నూటికి రూ.5,000 కమీషన్‌ తీసుకొంటున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.ఉదయం 9 గం. ల నుండి సాయంత్రం 9 గం. ల వరకు వేలాది మంది రైతులు గెలలను యార్డుకు తీసుకురావడంతో యార్డులోపల స్ధలం సరిపడకపోవడంతో  దళారులు యార్డులో రేటుకు సంబంధంలేకుండా తక్కువ ధరకే గెలలుకొనడం, వ్యాపారులకు అధికరేటుకు విక్రయించడం చేస్తున్నారు.  మొన్నటిదాకా కర్పురం గెల ఒక్కంటికి 300 గాను, చక్రకేళి రకం, ఇతర రకాలు గెల ఒక్కంటికి 400 పై బడి పలుకుతూ జోరుమీద ఉన్న అరటి  15రోజులు నుండి ఒక్కసారిగా 6 గెలలు  లోడు కర్పుర రకం రూ.500 కన్నా తక్కువగాను, చక్రకేళి, ఇతర రకాలు రూ. 500  నుండి 800 మాత్రమే పలకడంతో కనీసపెట్టుబడులు కూడా రాని పరిస్ధితి నెలకొనడంతో అరటి రైతు పూర్తిగా డీలాపడే పరిస్ధితి నెలకొంది..రైతుకు మేలు కలిగేందుకు దళారి వ్యవస్ధను నిర్ములించడంతో పాటు.. ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా పంటలు నష్టపోయే పచ్చి వ్యాపారమైన అరటి రైతులను  ప్రభుత్వం ఆదుకునేందుకు గిట్టుబాటు ధర కల్పించాలని  వేడుకోంటున్నారు.
Tags:Seasoning for banana benefits

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *