రెండు రోజుల్లో సీట్ల పంపిణీ ప్రక్రియ

Seat distribution process in two days

Seat distribution process in two days

Date:13/10/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి రవీంద్ర రెడ్డి శనివారం తెలంగాణ జన సమితిలో చేరారు.  ఈ సందర్బంగా టీజేఎస్ అధ్యక్షుడు కొందండరామ్ మాట్లాడుతూ రవీంద్రరెడ్డి రెడ్డి సామాజిక మార్పు కోసం కృషి చేస్తున్నారు. వారిని సాదరంగా మా పార్టీ లోకి ఆహ్వానిస్తునాం. టీడీపీ నాయకుడు ఎల్.రమణ, సీపీఐ నాయకుడు చాడ వెంకటరెడ్డి తో ఉదయం భేటీ అయ్యాం. పొత్తు లకు ఉమ్మడి ఐజెండా, అమలుకు కృషి చేయాలకున్నాం. రెండు రోజుల లో సీట్ల పంపిణీ.. కొలిక్కి రావాలని ఆశిస్తున్నామన్నారు. సీట్లు  సర్దుబాటు విషయం కొలిక్కి  తీసుకురావాల్సిన బాధ్యత కాంగ్రెస్ దే. దసరా లోగా ఈ సీట్ల పంపిణీ పై స్ఫష్టమైన.. నిర్ణయం వస్తుంది అని ఆశిస్తున్నాం. తదుపరి ఎన్నికల శంకరావం పూరిస్తూ ప్రచారం చేస్తామని అన్నారు. రవీంద్రరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ కోసం 1600 మంది యువకులు బలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ కేసీఆర్ నలుగురి కుటుంబ సభ్యుల సొత్తు కాదు. కోదండరాం ఉద్యమ సమయంలో కీలక భూమిక పోషించారని అన్నారు. నిరుద్యోగులకు లక్ష ఉద్యోగుల కు కేవలం..30 వేలు కూడా ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కన్నా ప్రగతి భవన్ అభివృద్ధి జరిగిందని ఆరోపించారు.
Tags:Seat distribution process in two days

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *