Natyam ad

ఎస్ఈబీ అధికారులు దాడులు- రూ.3లక్షల విలువైన కర్ణాటక మద్యం సీజ్

రామసముద్రం ముచ్చట్లు:

నియోజకవర్గంలోని రామసముద్రం వద్ద గురువారం ఉదయం ఎస్ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.3లక్షల విలువైన కర్ణాటక మద్యం, కారును సెబ్ అధికారులు సీజ్ చేశారు. సీఐ శ్రీహరి రెడ్డి కథనం మేరకు.. రామసముద్రంలో సెబ్ అధికారులు కారును ఆపగా ఓ వ్యక్తి కారు నిలుపకుండా వేగంగా మదనపల్లి వైపు వెళ్లడంతో అధికారులు కారును వెంబడించారు. పోలీసుల రాకతో చెంబకూరు వద్ద కారుని వదిలి నిందితుడు పారిపోయాడని తెలిపారు. పట్టుబడ్డ మద్యం, కారు సీజ్ చేశామన్నారు.

 

Post Midle

Tags: SEB officials raid- seizure of Karnataka liquor worth Rs.3 lakhs

Post Midle