Second ODI annuls

Second ODI annuls

Date:23/11/2018
మెల్ బోర్న్ ముచ్చట్లు:
భారత్, ఆస్ట్రేలియా మధ్య మెల్‌బోర్న్ వేదికగా శుక్రవారం జరిగిన రెండో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 19 ఓవర్లు ముగిసే సమయానికి 132/7తో నిలిచిన దశలో వర్షం రావడంతో ఆటని అంపైర్లు తాత్కాలికంగా నిలిపివేశారు. ఆ తర్వాత అరగంటకి వర్షం నిలిచిపోగా.. 18 ఓవర్లకి మ్యాచ్‌ని కుదించిన అంపైర్లు భారత్ టార్గెట్‌ని 137 పరుగులుగా నిర్ణయించారు. కానీ.. భారత్ ఓపెనర్లు మైదానంలోకి అడుగుపెట్టేలోపే మళ్లీ వర్షం ఆరంభమైంది. దీంతో.. మళ్లీ దాదాపు ముప్పావు గంట ఎదురు చూసి.. వర్షం ఆగిపోవడంతో.. 11 ఓవర్లకి మ్యాచ్‌ని కుదించి భారత్ టార్గెట్‌ని 90 పరుగులుగా నిర్ణయించారు. కానీ.. మళ్లీ అదే సీన్ రిపీట్.. భారత్ ఓపెనర్లు క్రీజులోకి వచ్చేలోపే చినుకులు. దీంతో.. ఇక ఆట కొనసాగే అవకాశం లేనందున అంపైర్లు మ్యాచ్‌ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తొలి టీ20లో ఆస్ట్రేలియా గెలుపొందగా.. మూడో టీ20 మ్యాచ్ టీ20 సిడ్నీ వేదికగా ఆదివారం జరగనుంది. వర్షంతో మ్యాచ్‌ ఆగిపోయే సమయానికి క్రీజులో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ బెన్‌ మెక్‌డెర్మాట్‌ (32: 30 బంతుల్లో 2×4), ఆండ్రూ టై (12: 13 బంతుల్లో 2×4) ఉన్నారు. గత బుధవారం రాత్రి ముగిసిన తొలి టీ20లోనూ ఇలానే 16.1 ఓవర్ల వద్ద వర్షం రావడంతో మ్యాచ్‌ని నిలిపివేసిన అంపైర్లు.. 17 ఓవర్లకి మ్యాచ్‌ను కుదించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో భారత్ 4 పరుగుల తేడాతో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో ఓడిపోయింది. తొలి టీ20లో తేలిపోయిన భారత్ బౌలర్లు రెండో టీ20లో అనూహ్యంగా పుంజుకున్నారు. తొలి ఓవర్‌ నుంచి వరుసగా ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్‌ని ఔట్ చేస్తూ ఆ జట్టుపై ఒత్తిడి పెంచారు. మొదటి ఓవర్ రెండో బంతికే ఓపెనర్ అరోన్ ఫించ్(0)ని డకౌట్‌గా భువనేశ్వర్ కుమార్ పెవిలియన్ బాట పట్టించగా.. ఆ తర్వాత కొద్దిసేపటికే ఖలీల్ అహ్మద్ హిట్టర్ క్రిస్‌లిన్ (13: 13 బంతుల్లో 1×4, 1×6), ఓపెనర్ డీఆర్క్ షార్ట్ (14: 15 బంతుల్లో 2×4)ని బోల్తా కొట్టించాడు. మిడిలార్డర్‌లో ఆదుకుంటాడని ఆశించిన స్టాయినిస్ (4) కూడా తక్కువ స్కోరుకే ఔటవడంతో ఆస్ట్రేలియా 41/4తో ఇబ్బందుల్లో పడింది.
Tags:Second ODI annuls

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *