Natyam ad

రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత వైఎస్సార్ రైతు భరోసా పథకం-మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

– చిత్తూరు జిల్లాలో వైఎస్సార్ రైతు భరోసా ను ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

-పుంగనూరు నియోజకవర్గం సోమలలో ఘనంగా రైతు భరోసా సభ

-జిల్లాలో నేడు మొత్తం 2.23 లక్షల మంది రైతులకు 44.76 కోట్ల రూపాయలు జమ

 

Post Midle

సోమల ముచ్చట్లు:

కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ   కే.అర్.జే. భరత్, జెడ్పీ చైర్మన్   గోవిందప్ప ,శ్రీనివాసులు, చిత్తూరు ఎంపి   ఎన్. రెడ్డప్ప, ఎమ్మేల్యేలు   పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి,   అరణి శ్రీనివాసులు, కలెక్టర్   ఎం. హరి నారాయణన్, పుంగనూరు నియోజకవర్గ ఎంపిపిలు, జెడ్పీటీసీలు, తదితరులు

2019-20 లో 2.20 లక్షల మంది రైతులకు 165.41 కోట్ల రూపాయలు జమ చేసిన ప్రభుత్వం

2020-21 లో 23.88 లక్షల మంది రైతులకు 179.42 కోట్ల రూపాయలు జమ

2021-22 లో సుమారు 2.71 లక్షల మంది రైతులకు 163.18 కోట్లు రైతుల అకౌంట్ లో జమ

ఈ ఏడాది మొదటి విడత కింద 2.71 లక్షల మంది రైతులకు 119.89 కోట్ల రూపాయలు జమ చేసిన వైఎస్ జగన్ సర్కార్

మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్……..

పుంగనూరు నియోజకవర్గం లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు కలెక్టర్ కు ధన్యవాదాలు

సంవత్సరం లో రైతులకు 13500 రూపాయలు రైతు భరోసా అందిస్తున్నాం

కౌలు రైతులకు, అర్.ఓ.ఎఫ్.అర్ భూములు ఉన్న రైతులకు కూడా రైతు భరోసా అందిస్తున్నాం

ఈరోజు మొత్తం 2.23 లక్షల మంది రైతులకు 44.76 కోట్లు అందిస్తున్నాం

గతంలో ప్రభుత్వాలు రైతులను పట్టించుకునే పరిస్థితి లేదు

స్వయంగా చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగ అన్నారు

నాగం జనార్దన్ రెడ్డి రైతులు మానసిక వ్యాధితో చనిపోతున్నారు అని అసెంబ్లీలో ప్రకటిస్తే దానికి చంద్రబాబు చప్పట్లు కొట్టారు

రాజశేఖర్ రెడ్డి గారు సిఎం అయ్యాక రైతు రుణ మాఫీ చేసి, రైతులను ఆదుకున్నారు

ఈరోజు చిత్తూరు జిల్లాకు నీరు అందుతుంది అంటే అది దివంగత సిఎం   వైఎస్ రాజశేఖర్ రెడ్డి చొరవ

అనంతపురం నుండి జిల్లాకు నీరు అందడం లేదని, స్వయంగా ముఖ్యమంత్రి గండికోట నుండి నీరు ఇవ్వడానికి సిద్దం అయ్యారు

ఎన్నికల లోపే గండికోట నీరు, హంద్రీ నీవా ద్వారా జిల్లాకు అందిస్తాం

మొత్తం 4 వేల కోట్ల రూపాయలతో యుద్ద ప్రాతిపదికన పనులు పూర్తి చేసి పుంగనూరు, తంబళ్లపల్లె, మదనపల్లి లాంటి ప్రాంతాలకు నీరు అందుతుంది.

అవులపల్లి ప్రాజెక్టుకు మొన్నే పూజ చేశాం, పుంగనూరు తో పాటుగా పీలేరు కూడా సాగు, త్రాగు నీరు అందుతుంది

ఈ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక రైతుల కోసం రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేశారు, ల్యాబులు అందుబాటులోకి తెచ్చారు

విత్తనాలు, యంత్రాలు, వ్యవసాయ పనిముట్లు అందిస్తూ వినూత్నంగా ముందుకు సాగుతున్నారు

యూ కే లాంటి ప్రాంతాలు, ఇతర దేశాలు నుండి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటుకు తమకు సహకరించాలని కోరుతున్నారు

కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా నేడు పథకాలు అందిస్తున్నారు

అందుకే గడప గడపకు కార్యక్రమం కోసం మన నాయకులు వెళుతుంటే టిడిపి కార్యకర్తలు మాకు నాలుగు లక్షలు అందాయి, ఐదు లక్షలు అందాయి అని చెపుతున్నారు

గతంలో జన్మభూమి కమిటీలు ఎంపిక చేసిన వారికే చంద్రబాబు పథకాలు అందించేవారు

వైఎస్సార్ ఆసరా పేరుతో 18 వేల కోట్లు మహిళల కు సిఎం జగన్ చెల్లించారు

చంద్రబాబు మహిళా రుణాలు మాఫీ చేస్తాం అని చెప్పి వారికి అన్యాయం చేశారు

ఈరోజు సోమల మండలం లో అర్హులందరికీ చేయూత పథకం అందిస్తున్నాం

ఈరోజు స్కూల్స్, హాస్పిటల్స్ ను అభివృద్ధి చేస్తున్నారు

ఏళ్ల తరబడి సున్నం కూడా కొట్టని స్కూల్స్ ను పునః నిర్మిస్తున్నారు.

ప్రతి పల్లెలో ఇప్పటికే ఓవర్ హెడ్ ట్యాంక్ ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు లు పూర్తి అయితే ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందిస్తాం

98.44 శాతం ఎన్నికల హామీలు మూడు సంవత్సరాల్లో పూర్తి చేసిన ఏ ముఖ్యమంత్రి దేశం చరిత్ర లో లేరు

చంద్రబాబు 2014 మానిఫెస్టో వారి వెబ్ సైట్ నుండి తొలగించారు

మాట చెపితే మడమ తిప్పను అని జగన్ గారు చెపితే…. మోసం చేయడం చంద్రబాబు కు అలవాటు

ఇదే వారి ఇద్దరికీ ఉన్న తేడా

వైఎస్ జగన్ పాలన లో అందరూ సంతోషంగా ఉన్నారు. ఇదే సంతోషం కలకాలం ఉండాలంటే మళ్ళీ మనం జగన్ గారికి ఓటు వేయాలి.

 

 

Tags: Second phase of YSR Rythu Bharosa scheme across the state-Minister Peddireddy Ramachandra Reddy

Post Midle