రెండవ వైస్ ఎంపీపీ ఎన్నిక వాయిదా-ఎస్.ఓ శేషయ్య

తుగ్గలి ముచ్చట్లు:
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండవ మండల ఉపాధ్యక్షునిగా ఎన్నుకోవాలని ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు జిల్లా వ్యాప్తంగా మంగళవారం రోజున ఎన్నికలను నిర్వహించారు. మండల కేంద్రమైన తుగ్గలిలోని స్థానిక ఎంపిడిఓ కార్యాలయం నందు మంగళవారం రోజున స్పెషలాఫీసర్ శేషయ్య ఆధ్వర్యంలో రెండవ మండల ఉపాధ్యక్షుని ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు.కానీ రెండవ మండల ఉపాధ్యక్షుని ఎన్నిక కు గౌరవ సభ్యుల కోరం లేనందున సమావేశాన్ని ఐదవ తేదీ అనగా గురువారం రోజుకు వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలియజేశారు.గురువారం రోజున 11గంటలకు రెండవ మండల ఉపాధ్యక్షుని ఎన్నికను నిర్వహిస్తామని,గౌరవ ఎంపీటీసీ సభ్యులు అందరూ హాజరు కావాలని స్పెషలాఫీసర్ శేషయ్య తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వీర రాజు,పరిపాలనాధికారి పార్థసారథి,పిఆర్ఏఈ వెంకటేశ్వర్లు, పలువురు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Second Vice MPP Election Postponed-SO Seshayya

Natyam ad