Natyam ad

మార్చి నుంచే సూర్యుడి సెగలు

• ఏప్రిల్‌, మే నెలల్లో మరింత ప్రభావం చూపనున్న ఎండలు
• వేడిగాలులతో వడదెబ్బ బారిన పడే ప్రమాదం
• ఎండలపై సమాచారంకు టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101
• సెల్ ఫోన్లకు వడగాల్పుల హెచ్చరిక సందేశాలు
• తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్‌

 

అమరావతి ముచ్చట్లు:

Post Midle

సూర్యుడు ఫిబ్రవరి నెల నుంచే సుర్రుమనిపిస్తున్నాడు. రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. క్రమేపి రాష్ట్ర వ్యాప్తంగా పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. భానుడి భగ భగలకు బయట అడుగు పెట్టేందుకు జనం భయపడుతున్నారు.

మార్చి, ఏప్రిల్‌, మే లో తీవ్రతరం…

ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో ఏప్రిల్‌, మే నెలలతోపాటు మార్చి నుంచే ఎండలు ప్రభావం చూపుతాయని, దీంతోపాటు ఈసారి వడగాలుల ప్రభావం కూడా అధికంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించినట్లు విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్‌ తెలిపారు. కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైయస్సార్ కడప జిల్లాల్లో ఎక్కువగాను, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, విశాఖ, ప్రకాశం, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. విపత్తుల నిర్వహణ సంస్థ తగు చర్యలు తీసుకుని ఎప్పటికప్పుడు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసి ప్రాణనష్టాన్ని తగ్గించగలుగుతుందన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే జిల్లాలపై అధికారులు దృష్టి సారించాలని సూచనలు జారీ చేశారు.

2016 నుంచి 2022 వరకు వరుసగా 48.6°C, 47.8°C ,45.6°C, 47.3°C, 47.8°C, 45.9°C, 45.9 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదుకాగా, గతేడాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ లో అత్యధికంగా 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వివరించారు.

2016లో 723 , 2017లో 236, 2018లో 8, 2019లో 28 వడగాల్పుల మరణాల నమోదుకాగా విపత్తుల సంస్థ, జిల్లాయంత్రాంగం సమన్వయ చర్యలతో 2020,21,22లో వడగాల్పుల మరణాలు అసలు సంభవించలేదని గత ఏడాది 03 (ప్రకాశం2, చిత్తూరు1) వడగాల్పుల మరణాలు నమోదైందన్నారు.

అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులు ఎప్పటికప్పుడు విపత్తుల నిర్వహణ సంస్థలోని స్టేట్ ఏమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తూ జిల్లా యంత్రాంగానికి రెండు రోజుల ముందుగానే ఉష్ణోగ్రత వివరాలు, వడగాలుల తీవ్రతపై సూచనలు జారీచేయనున్నట్లు చెప్పారు. రియల్ టైమ్ లో ఎండ తీవ్రతంగా ఉండే మండల అధికారులను అప్రమత్తం చేయనున్నట్లు తెలిపారు.

మరోవైపు ఎండలతో పాటు క్యుములోనింబస్ మేఘాల వలన ఆకస్మికంగా భారీవర్షాలు. పిడుగులు పడనున్నందున వీటిపట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎండల సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే విపత్తుల సంస్థ స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రదించాలన్నారు. ప్రజల ఫోన్లకు విపత్తుల సంస్థ నుంచి వడగాల్పుల హెచ్చరిక సందేశాలు జారీ చేస్తామన్నారు.

దినసరి కూలీలు ఉదయంపూటనే పనులు పూర్తిచేసుకొని మధ్యాహ్నంలోగా ఇంటికి చేరేలా చూసుకోవాలని సూచించారు. ఇక నుంచి మధ్యాహ్నం పూట బయటికి వెళ్లాలంటే తప్పకుండా గొడుగులు వెంట తీసుకెళ్లాలంటున్నారు. గర్బిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలని, ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్‌ ధరించాలన్నారు. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలి. మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి కూర్మనాథ్‌ సూచించారు.

 

Tags: Seconds of the sun from March

Post Midle