Natyam ad

సదుం మండలంలో సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు అవగాహన సదస్సు

సదుం ముచ్చట్లు:

పుంగనూరు నియోజకవర్గం లో రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన.ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే  పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, చిత్తూరు ఎమ్మెల్యే  అరణి శ్రీనివాసులు

మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్…

చంద్రబాబు నాయుడు గోరంత పని చేస్తే పత్రికలు కొండంత రాస్తున్నారు.మనం కొండంత మంచి చేసిన గోరంత ప్రచారం కూడా చేసుకోలేదు.అందుకే ఈ రోజు మన చేసిన మంచి ప్రజలకు తెలియజేయాలనే ఈరోజు గృహ సారథులు ను నియమించారు.14 ఏళ్లు ముఖ్యమంత్రి గా ఉండి చంద్రబాబు రాష్ట్రానికి, జిల్లాకు కానీ ఎం చేశారు.గతంలో పథకాలు కావాలన్నా కూడా జన్మభూమి కమిటీలు నిర్ణయించాలి.వారికి కావాల్సిన వారికి మాత్రమే పథకాలు ఇచ్చే వారు.కానీ ఈరోజు ప్రతి పేద వారికి పథకాలు అందుతున్నాయి… లంచానికి ఎటువంటి తావు లేకుండా నేరుగా అకౌంట్ లో డబ్బులు జమ చేస్తున్నాం.కొంత మంది టీడీపి నాయకులు, కార్యకర్తలు సొంత జేబులో డబ్బులు పంచారా అని ప్రశ్నిస్తున్నారు.మరి చంద్రబాబు నాయుడు ఎందుకు ఈ పథకాలు అమలు చేయలేదు.ఈరోజు జగన్ మోహన్ రెడ్డి గారు 98.44 శాతం ఎన్నికల హామీలు అమలు చేశారు.నా ఇన్ని సంవత్సారాలు రాజకీయ అనుభవం లో ఈ స్థాయిలో హామీలు అమలు చేసిన ముఖ్యమంత్రి లేరు.చంద్రబాబు 600 హామీలు ఇచ్చి, మానిఫెస్టో ను కూడా కనపడకుండా దాచిపెట్టారు.అధికారంలోకి రావాలంటే రైతు రుణమాఫీ ప్రకటించాలని చెప్పినా…. చేయలేనివి చెప్పలేను అని చెప్పిన గొప్ప వ్యక్తి  వైఎస్ జగన్.ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నారు.మరో పక్క నాడు నేడు ద్వారా ఆసుపత్రులు, పాఠశాలలు అభివృద్ధి చేస్తున్నారు.

 

 

 

 

ఈరోజు కార్పొరేట్ స్కూల్స్ కంటే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మంచి మార్కులు సాధించారు.చంద్రబాబు నాయుడును ఎలా అయినా గెలిపించాలని కొన్ని పత్రికలు విషప్రచారాలు చేస్తున్నాయి.పుంగనూరు తో పాటు మరో మూడు నియోజకవర్గల్లో 2400 కోట్లతో ఇంటింటికీ నీరు అందించేందుకు కృషి చేస్తున్నాం.ఇప్పటికే తాగు, సాగు నీటిని ఇబ్బంది లేకుండా మొత్తం మూడు ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం.గృహ సారథులు ప్రతి ఇంటిని సందర్శించి వైసిపి ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరించి… విజయం దిశగా అడుగులు వేయాలి

 

ఎమ్మెల్యే  పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి కామెంట్స్…..

ఒకరి ఇంట్లో ఒక మంత్రిని, ఎంపిను, ఒక ఎమ్మెల్యేను చేయడం చిన్న విషయం కాదుసదుం మండల ప్రజలకు మేము ఎప్పుడు రుణపడి ఉంటాం.తంబళ్లపల్లె లో కూడా సదుం నుండి వచ్చి మరీ నా విజయానికి ప్రజలు కృషి చేశారు.ఇక్కడ మాట్లాడడం నా సొంత ఇంట్లో మాట్లాడినట్టు గా ఉంది.సదుం లో ఉన్నవారంతా మా బంధువులే.

Tags:Secretariat Convenors, Household Heads Awareness Conference in Sadum Mandal