పుంగనూరులో 30న సచివాలయ కన్వీనర్ల సమావేశం
పుంగనూరు ముచ్చట్లు:
గ్రామ,పట్టణ సచివాలయాల కన్వీనర్ల సమావేశం బుధవారం ఉదయం 10 గంటలకు మున్సిపల్ మీటింగ్ హాల్‌లో నిర్వహిస్తున్నట్లు ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు సచివాలయాల కన్వీనర్ల భీమా సౌకర్యం గురించి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇందుకోసం సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, కౌన్సిలర్లు ఈ సమావేశానికి తప్పక హాజరుకావలెనని కోరారు.

Tags: Secretariat Convenors meeting on 30th at Punganur
