Natyam ad

పుంగనూరులో సచివాలయ ఉద్యోగులు అపోహలకు తావులేకుండ పని చేయాలి- ఎంపిపి భాస్కర్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:
 
ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థలో ఉద్యోగులు అపోహలకు తావులేకుండ క్రమశిక్షణతో పనిచేయాలని ఎంపిపి అక్కిసాని భాస్కర్‌రెడ్డి కోరారు. బుధవారం ఎంపీడీవో లక్ష్మీపతి ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగులకు యూనిఫాం దుస్తులను పంపిణీ చేశారు. అలాగే క్లీన్‌ ఆంధప్రదేశ్‌లో భాగంగా తడిచెత్త, పొడిచెత్త ను తరలించేందుకు పంచాయతీల వారీగా మూడుచక్రాల సైకిళ్లను, మరుగుదొడ్లు శుభ్రం చేసే మిషన్లను పంపిణీ చేశారు. ఎంపిపి మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు ఆదర్శంగా పనిచేసి, ప్రభుత్వ పథకాలను పేదలకు అందించాలన్నారు. గ్రీన్‌ అంబాసిడర్లు చెత్తను ఎప్పటికప్పుడు తరలించి, గ్రామాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పారిశుద్ధ్యం మెరుగుపడితే ప్రజల ఆరోగ్యం బాగుపడుతుందని , దీనిని దృష్టిలో ఉంచుకుని పంచాయతీల వారీగా ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, వలంటీర్లు పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్‌ నాగరాజారెడ్డి, వైస్‌ ఎంపిపి సరోజమ్మ, వైఎస్సార్‌సిపి నాయకులు చంద్రారెడ్డి యాదవ్‌, రాజశేఖర్‌రెడ్డి, రమణ, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags; Secretariat employees in Punganur should work tirelessly for rumors – MP Bhaskar Reddy