పుంగనూరులో సచివాలయ ఉద్యోగుల నిరసన
పుంగనూరు ముచ్చట్లు:
సచివాలయ ఉద్యోగులను రెగ్యూలర్ చేసి, ఫిట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రూరల్ మండలంలోని 21 సచివాలయాలకు చెందిన ఉద్యోగులు సోమవారం మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. అలాగే మండలం , పట్టణానికి చెందిన సచివాలయ ఉద్యోగులు మండల కార్యాలయము, మున్సిపాలిటి వద్ద బైఠాయించి, నిరసనలు తెలిపారు. ఎంపిపి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ముడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, ఏఎంసీ చైర్మన్ నాగరాజారెడ్డికి, ఎంపీడీవో లక్ష్మీపతికి, అలాగే మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, కమిషనర్ రసూల్‌ఖాన్ కు వినతిపత్రాలు అందజేశారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్మోహన్రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags; Secretariat employees protest in Punganur