పుంగనూరులో సచివాలయ సేవలు ప్రశంసనీయం -ఎంపీపీ భాస్కర్‌రెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సచివాలయాలు గ్రామీణ ప్రాంతాలలో అద్భుతమైన సేవలు అందిస్తోందని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి ప్రశంసించారు. మంగళవారం ఆయన మాగాండ్లపల్లె సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, పనితీరు, ప్రజా సమస్యల నమోదులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీపీ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి ఆధ్వర్యంలో సచివాలయాల ద్వారా అన్ని రకాల సమస్యలు పరిష్కరించి ఆదర్శంగా నిలుస్తున్నామన్నారు. ప్రజలకు వచ్చే ఏ సమస్యనైనా సచివాలయాలలో పరిష్కరించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: Secretariat services in Punganur are commendable – MPP Bhaskar Reddy
