సచివాలయాలు ఆదర్శంగా ఉండాలి – కలెక్టర్‌ హరినారాయణ్‌

పుంగనూరు ముచ్చట్లు:
 
ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ ఆదర్శంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ హరినారాయణ్‌ అన్నారు. గురువారం ఆయన పట్టణంలోని ఎన్‌.ఎస్‌.పేటలో గల 11 వ సచివాలయాన్ని సబ్‌ కలెక్టర్‌ జాహ్నవితో కలసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయాలలో నవరత్నాల పోస్టర్లు సక్రమంగా లేకపోవడంపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. డిజిటల్‌ నమోదు కార్యక్రమాన్ని కలెక్టర్‌ పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే జగనన్న హౌసింగ్‌ కార్యక్రమం సక్రమంగా నిర్వహించలేదని నిలధీశారు. ప్రభుత్వ పథకాలు, లబ్దిదారుల జాబితాలను పకడ్భంధిగా అందరికి తెలియజేసేలా ఉండాలన్నారు. సమస్యలను అన్నింటిని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని , ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.ఆలసత్వం వహించినా, ప్రజలతో అమర్యాదగా ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు విజిట్‌ బుక్కులో నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ రసూల్‌ఖాన్‌, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Secretariats should be ideal – Collector Harinarayan

Natyam ad