18న సికింద్రాబాద్ నియోజకవర్గ పద్మశాలీ ఆత్మీయ సమ్మేళనం

Date:16/11/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
బిసి సామాజిక వర్గాల్లో బలమైన వర్గమైన పద్మశాలీలు సంఘటితమై ముందుకు రావలసిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణా పద్మశాలి ఐఖ్యవేదిక వ్యవస్థాపక అద్యక్షులు మహేషుని లక్ష్మయ్య నేత,మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు బల్ల గీత, నేతలు పిలుపు నిచ్చారు.ఈ నెల 18 న జరిగే సికింద్రాబాద్ నియోజకవర్గం పద్మశాలిల ఆత్మీయ సమ్మేళనం లో అధికసంఖ్యలో పద్మశాలిలు పాల్గొనాలని వారు పిలుపు నిచ్చారు.దసరా,దీపావళి పండుగలు పురస్కరించుకొని నిర్వహించే ఈ ఆత్మీయ సమ్మేళనం పూర్తిగా రాజకీయాలకు అతీతమైనదని అన్ని రాజకీయ పార్టీల అభిమానులు ఈ సమ్మేళనానికి హాజరు కావాలని వారు కోరారు.ప్రస్తుతం రాష్ట్రము లో జరుగుతున్న ఎన్నికలకు ఈ సమ్మెలనానికి ఏలాంటి సంబంధం లేదని వారు స్పష్టం చేసారు.ఇలాంటి కలయికల ద్వార పద్మశాలిల్లో ఐక్యతను పెంపొందిన్చడమే కాకుండా వీరిలో చైతన్యం పెంపొందించడానికి వీలు కలుగుతున్దన్నారు. సంఘాల పేరుతో సంఘటితంగా లేని పద్మశాలిలు ఒక్క తాటిపైకి రావలసిన అవసరం  ఎంతైనాఉందన్నారు.నీతి,నిజాయతికి మారు పేరుగా నిలిచిన పద్మ శాలిలు ఆర్దికంగా  సామాజికంగా,రాజకీయంగా వెనుకబడి ఉన్నారని,ఇలాంటి కలయికల ద్వార పేదరికం తో మగ్గుతున్న వారికి చేదోడు వాదోడుగా నిలువ గలిగే  ఆస్కారం ఉంటుందని వారు తెలిపారు.
Tags:Secunderabad constituency Padmashree is a spiritual composition on 18th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *