అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా యుద్దక్షేత్రంగా మారిన సికింద్రాబాద్‌ స్టేషన్‌

రైల్వే స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లి పట్టాలపై పార్సిల్‌ సామాన్లకు నిప్పు
ప్లాట్‌ఫామ్‌ ఆగిఉన్న రైళ్ల అద్దాలు ద్వంసం
ప్లాట్ ఫాం లపై ఉన్న దుకాణాల్లో వస్తువులు, ఫర్నీచర్‌ను ధ్వంసం
ఈస్టుకోస్టుకు నిప్పు ఆర్పీఎఫ్ జ‌రిపిన‌ కాల్పుల్లో వ‌రంగ‌ల్ యువ‌కుడు మృతి

 

హైదరాబాద్‌  ముచ్చట్లు:

 

అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఆందోళనకారులు బీభత్సం సృష్టించారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ను యథాతథంగా నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగిన యువత విధ్వంసానికి పాల్పడ్డారు. రైల్వే స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లి పట్టాలపై పార్సిల్‌ సామాన్లు వేసి నిరసన తెలిపారు. ప్లాట్‌ఫామ్‌లపై ఉన్న దుకాణాల్లో వస్తువులు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.స్టేషన్‌లో ఆగిఉన్న రైళ్ల అద్దాలు పగులగొట్టారు. పోలీసులపై రాళ్లదాడిచేశారు. పార్సిల్‌ సామానుకు, హైదరాబాద్‌ నుంచి కోల్‌కతా వెళ్లే రైలుకు, ఈస్ట్‌ కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పుపెట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేసారు.దీనితో  రైల్వే స్టేషన్‌లో నార్త్‌, ఈస్ట్‌, వెస్ట్‌ జోన్‌ పోలీసులు భారీగా మోహరించారు. అగ్నిపథ్‌ను రద్దు చేయాలంటూ స్టేషన్‌ ఆవరణలో నినాదాలు చేశారు. ఆ తర్వాత ఒకటో నంబరు ప్లాట్‌ఫారమ్‌పైకి చేరుకున్ని బయలుదేరేందుకు సిద్దంగా ఉన్న రైలు ఇంజను ఎదుట బ్యానర్లు పట్టుకుని నినాదాలు చేశారు. నిరసన కార్యక్రమం అంతా సవ్యంగా సాగిపోతుందనునే దశలో ఒక్కసారిగా అదుపు తప్పింది.అప్పటి వరకు ప్రశాంతంగా ఆందోళన చేస్తున్న యువకుల్లో కొందరు అదుపు తప్పారు. రైల్వే ఆస్తులపై దాడులకు తెగబడ్డారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఇదంతు ఉదయం 9 గంటల సమయంలో మొదలైంది. యువకుల ఆందోళను అదుపు చేసేంత రైల్వే బలగాలు అందుబాటులో లేకపోవడంతో ఒక్కసారిగా అదుపు తప్పిన ఆందోళన బీభత్సంగా మారిపోయింది.

 

 

 

Post Midle

నిమిషాల వ్యవధిలోనే ఒకటో నంబరు నుంచి మూడో నంబరు ఫ్లాట్‌ఫారమ్‌ వరకు రణరంగంగా మారింది.ఓవైపు ఆవేశంలో ఉన్న యువకులు మరోవైపు వారిని కంట్రోల్‌ చేసే పరిస్థితి లేకపోవడంతో సికింద్రాబాద్‌ స్టేషన్‌ యుద్దక్షేత్రంగా మారిపోయింది. పార్సిల్‌ కార్యాలయంలోకి చొరబడిన యువకులు అక్కడ చేతికి అందిన వస్తువునుల బయటకు తీసుకువచ్చారు. రైల్వ పట్టాలపై వేసి తగుల బెట్టారు. ఇందులో ద్విచక్ర వాహనాలతో త్వరగా మండిపోయే స్వభావం ఉన్న వస్తువులు ఉండటంతో క్షణాల్లో స్టేషన్‌ ఆవరణలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియిన అయోమయం నెలకొంది. దీంతో రైళ్లలో ఉన్న ప్రయాణిణులు గందరగోళానికి గురయ్యారు. ప్రయాణం స్టేషన్‌కు వచ్చిన వారు ప్రాణభయంతో పరుగులు తీశారు.
ఈస్టుకోస్టుకు నిప్పు
స్టేషన్‌లో దట్టమైన పొగలు అలుముకోవడం, మంటలు వ్యాపించడంతో ఇక ఆందోళనకు అడ్డే లేకుండా పోయింది. అరగంట పాటు స్టేషన్‌లో ఏం జరుగుతుందో తెలియకుండా పోయింది. దీంతో ఆందోళనకారులు మరింతగా రెచ్చిపోయారు. ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ఈస్టుకోస్టు ఎక్స్‌ప్రెస్‌కి నిప్పు పెట్టారు. ముఖ్యంగా ఆ రైలులో పార్సిల్‌ కౌంటర్‌ తెరిచే ఉంటంతో మంటలు త్వరగా వ్యాపించాయి. క్షణాల్లోనే ఇతర బోగీలకు చేరుకున్నాయి. దీంతో సికింద్రాబాద్‌ స్టేషన్‌ అంతా నల్లని దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ ఘటనలో ఈస్ట్‌కోస్టుతో పాటు అజంతా, ఒక ఎంఎంటీఎస్‌ రైలు బోగీలు మంటల్లో కాలిపోయాయి.
అప్రమత్తం రైల్వే అధికారులు, పోలీసులు

 

 

ఒక్కసారిగా చెలరేగిన ఆందోళనతో ఇటు రైల్వే అధికారులు, అటు రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌కు వచ్చే రైళ్లను ఎక్కడిక్కడే నిలిపేశారు. స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులు ఇతరులను బయటకు పంపించారు. రాష్ట్ర పోలీసులు బలగాలను అక్కడికి రప్పించారు. అయితే అప్పటికే స్టేషన్‌లో భీతావహా వాతావరణ పరిస్థితి నెలకొంది. లాఠీఛార్జ్‌ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చే పరిస్థితులు కూడా కనిపించకపోవడంతో ఆందోళన కారులకు పోలీసులు ‍నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే భారీ ఎత్తున నష్టం వాటిల్లింది.
ఫర్నీచర్‌ ధ్వంసం
ఒకటి నుంచి మూడో నంబరు వరకు ఫ్లాట్‌ఫారమ్స్‌పై భారీగా ఆస్తి నష్టం జరిగింది. స్టేషన్‌పై ఉన్న కేఫ్‌టేరియాలో కూడా ధ్వంసం అయ్యాయి. లైట్లు, సీసీ కెమెరాలు, చెత్త కుండీలు ఇలా ప్లాట్‌ఫారమ్‌పై కనిపించిన వస్తువులు ధ్వంసం అయ్యాయి. మరోవైపు స్టేషన్‌ బయట కూడా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆందోళనలకు బయపడిన ప్రయాణికులు కొందరు తమ వస్తువులను స్టేషన్‌ ఆవరణలోనే వదిలేసి బయటకు పరుగులు తీశారు. మరికొందరు తమ వాళ్లు తప్పిపోయారంటూ ఆందోళన చెందారు. చివరకు ఉదయం 10:30 గంటల సమయంలో పరిస్థితి అదుపులోకి వస్తోంది. అయితే ఈ ఘటనతో తమకు సంబంధం లేదని ఎన్‌ఎస్‌యూఐ ప్రటకించింది.

 

టియర్‌గ్యాస్‌ ప్రయోగం
పదిన్నర తర్వాత పోలీసుల బలగాలు భారీగా చేరుకున్నాయి. దీంతో పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు టియర్‌ గ్యాస్‌ను ప్రయోగించారు. మరోవైపు స్టేషన్‌కు చేరుకున్న ఫైర్‌ ఫైటర్లు మంటలను అదుపు చేసే పనిలో ఉన్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఆందోళనలో ఇద్దరు మరణించినట్టు వార్తలు వస్తున్నాయ్‌.
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో హైదరాబాద్‌ మెట్రో రైళ్లను అధికారులు నిలిపివేశారు. మెట్రో స్టేషన్లకు ప్రయాణికులు రావొద్దని అధికారులు సూచించారు. నగరంలోని అన్ని మార్గాల్లో రైళ్లను రద్దు చేస్తున్నట్లు మెట్రో ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి ప్రకటించారు. రేపటి నుంచి యధావిధిగా సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అలాగే హైదరాబాద్‌లో సబ్‌ అర్బన్‌ సర్వీస్‌లను రద్దుచేశారు. మరోవైపు ఢిల్లీలోనూ మెట్రో రైళ్లను అధికారులు నిలిపివేశారు.
అప్రమత్తమైన దక్షిణ మధ్య రైల్వే.. 71 రైళ్లను తాత్కాలికంగా రద్దు

 

 

 

అగ్నిపథ్‌ ఆందోళనలు హైదరాబాద్‌కు పాకిన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. సికింద్రాబాద్‌ పరిధిలోని 71 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది. ఎంఎంటీఎస్‌ రైళ్లను కూడా రద్దు చేసింది. దేశవ్యాప్తంగా ఆర్మీ అభ్యర్థుల ఆందోళనల నేపథ్యంలో రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేశారు. వరంగల్‌ రైల్వే స్టేషన్‌లోనూ రైళ్లను ఆపివేశారు. రైళ్లను ఎక్కడికక్కడ ఆపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే రైల్వే అధికారులు అల్లర్లు సద్దుమణిగిన తర్వాత సర్వీసులను పునరుద్దరిస్తామని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే, అగ్నిపథ్ నిరసన సెగ రైల్వే ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తుంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రణరంగంగా మారడంతో పలు రైళ్ళు రద్దయ్యాయి. మరి కొన్ని రైళ్ళు ఆలస్యంగా నడుస్తున్నాయి. అగ్నిపథ్ ఆందోళనతో  రైల్వే స్టేషన్లలో పోలీసులు భారీగా మోహరించి పకడ్బందీ చర్యలు చేపట్టారు. ప్లాట్ ఫామ్ పైకి ఎవ్వరిని రానివ్వకపోవడంతో స్టేషన్ బోసిపోగా, స్టేషన్ ముందు ప్రయాణీకులు నిరీక్షిస్తున్నారు.
ఆర్పీఎఫ్ జ‌రిపిన‌ కాల్పుల్లో వ‌రంగ‌ల్ యువ‌కుడు మృతి
సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో శుక్ర‌వారం ఆర్పీఎఫ్ జ‌రిపిన‌ కాల్పుల్లో వ‌రంగ‌ల్ యువ‌కుడు మృతిచెందాడు. అత‌డిని ఖానాపురం మండ‌లం ద‌బీర్‌పేట‌కు చెందిన రాకేశ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ మేర‌కు పోలీసులు రైల్వే అధికారులు స‌మాచార‌మిచ్చారు.

 

Tags: Secunderabad station turned into a battlefield against the fire

Post Midle
Natyam ad